పల్లెపల్లెకూ టీడీపీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
ABN , Publish Date - Dec 17 , 2025 | 10:46 PM
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పల్లెపల్లెకూ తీసుకెళ్లి ప్రచారం నిర్వహిస్తామని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు షేక్ గయాజ్‌బాషా చెప్పారు.
పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గయాజ్‌బాష
పీసీపల్లి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పల్లెపల్లెకూ తీసుకెళ్లి ప్రచారం నిర్వహిస్తామని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు షేక్ గయాజ్‌బాషా చెప్పారు. పీసీపల్లిలోని పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు వేమూరి రామయ్యతో కలిసి బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే దక్కిందన్నారు. త్వరలో సాంస్కృతిక విభాగం తరఫున ప్రతిపల్లెకూ వెళ్లి కళాజాత ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జి పులి ప్రతా్‌పరెడ్డి, మండల సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుంటగాని జోసెఫ్, కడప ఓబుల్‌రెడ్డి, గ్రామకమిటీ అధ్యక్షుడు కంచర్ల వెంగయ్య, బీసీసెల్ కార్యదర్శి కోమటిగుంట్ల వీరయ్య, మూలె మహేంద్రరెడ్డి, వేమూరి సురేష్, కేతినేని గురవయ్య, తదితరులు ఉన్నారు.