కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ అండ
ABN , Publish Date - Nov 08 , 2025 | 10:36 PM
పార్టీ సభ్యత్వం తీసుకుని ప్రమాదవశాత్తు మృతిచెందిన కుటుంబాలకు టీడీపీ అండగా ఉండి భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.
రూ.5లక్షల చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : పార్టీ సభ్యత్వం తీసుకుని ప్రమాదవశాత్తు మృతిచెందిన కుటుంబాలకు టీడీపీ అండగా ఉండి భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఇటీవల పార్టీ సభ్యత్వం తీసుకొని మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5లక్షల చొప్పున చెక్కును ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పంపిణీ చేశారు. పట్టణంలోని ఓబురాయి సురేష్, అనుమల శ్రీనివాసులు, సగినాల విజయ్‌కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, వారి కుటుంబాలకు ఎమ్మెల్యే చెక్కును అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్ బైలడుగు బాలయ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ షానేషావలి, కౌన్సిలర్ లొక్కు రమేష్, యూనిట్ ఇన్‌చార్జి బోయిళ్లపల్లి కిశోర్, కాతా రామచంద్రరెడ్డి, బనగాని నరసింహులు, నంద్యాల ఈశ్వరయ్య, సర్పంచ్ కర్నాటి రామసుబ్బారెడ్డి, ఆవుల రాజగోపాల్, దూదేకుల దస్తగిరి పాల్గొన్నారు.