Share News

టీడీపీలో క్రమశిక్షణతో మెలగాలి

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:36 PM

తెలుగు దేశం పార్టీలో క్రమశిక్షణతో మెలగాలని ఎమ్మెల్యే డా క్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పీసీపల్లి మండలం లోని పీసిపల్లి సర్పంచ్‌ మరియమ్మ వైసీపీని వీడి మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరారు.

టీడీపీలో క్రమశిక్షణతో మెలగాలి
ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరిన పీసీపల్లి సర్పంచ్‌ మరియమ్మ

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

వైసీపీని వీడిన పీసీపల్లి సర్పంచ్‌

కనిగిరి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలుగు దేశం పార్టీలో క్రమశిక్షణతో మెలగాలని ఎమ్మెల్యే డా క్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పీసీపల్లి మండలం లోని పీసిపల్లి సర్పంచ్‌ మరియమ్మ వైసీపీని వీడి మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరారు. ఈసందర్భంగా ఆమెకు పార్టీ కం డువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సర్పంచ్‌ మరియమ్మ మాట్లాడుతూ కనిగిరి ప్రాం తంలో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి చేస్తున్న అ భివృద్ధి, ప్రజాసేవతో పాటు నిస్పాక్షికమైన పాలన అందిస్తుండటం తనను ఎంతో ఆకర్షించిందన్నారు. ఆ యన ఆధ్వర్యంలో టీడీపీ మరింత బలోపేతం కానుం దని భావించి ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు పూర్తి విశ్వాసంతో టీడీపీలో చేరినట్లు ఆమె పే ర్కొన్నారు.

పీసీపల్లి పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ప్రజాప్రభుత్వం ప్రజాపయోగకర పథకా లను వివరించి అవగాహన కార్యక్రమాలు నిర్వహి స్తామని సర్పంచ్‌ మరియమ్మ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు కృషి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ పార్టీలో చేరిన వారు చేస్తున్న కార్యక్రమాలను అనునిత్యం గమ నిస్తామన్నారు. అదేక్రమంలో టీడీపీ బలోపేతానికి కృషి చేసిన వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుం దన్నారు. కనిగిరి ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి వెళ్ళేలా కలసి పనిచేద్దామన్నారు. కార్యక్ర మంలో టీడీపీ పీసీపల్లి మండల అధ్యక్షుడు వేమూరి రామయ్య, సానికొమ్ము విజయభాస్కర్‌రెడ్డి, గోగడి రత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2025 | 11:36 PM