టీడీపీలో క్రమశిక్షణతో మెలగాలి
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:30 PM
టీడీపీలో క్రమ శిక్షణతో మెలుగుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం చింతగుంపల్లి గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ దుంపా సంపూర్ణ 20 కుటుంబాలతో కలసి మండలపార్టీ అధ్యక్షుడు వే మూరి రామయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చే రారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
వైసీపీ సర్పంచ్‌తో సహా 20 కుటుంబాలు పార్టీలో చేరిక
కనిగిరి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): టీడీపీలో క్రమ శిక్షణతో మెలుగుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం చింతగుంపల్లి గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ దుంపా సంపూర్ణ 20 కుటుంబాలతో కలసి మండలపార్టీ అధ్యక్షుడు వే మూరి రామయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చే రారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిఒ క్కరూ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. టీడీ పీలో ఉన్న నాయకులు వైసీపీని వీడి వచ్చినవారిని కలుపునకుపోయి పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలన్నారు. టీడీపీలో చేరిన సర్పంచ్ దుంపా సం పూర్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నారన్నారు. కనిగిరి ప్రాం తాభివృద్ధి కోసం ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి టీడీపీలో చేరినట్టు చెప్పారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో చింతగుం పల్లి గ్రామంలో తెలుగుదేశం విజయకేతం ఎగురవే స్తుందన్నారు. కార్యక్రమంలో చింతగుంపల్లి నాయకులు మల్లికార్జునరెడ్డి, ఉండేల పిచ్చిరెడ్డి, తదితరులు పాల్గొ న్నారు.