టీడీపీ నేతల సంబరాలు
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:50 PM
మార్కాపురం జిల్లాకు కేబినెట్ ఆమోదం తెలపడంతో మంగళవారం ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఆధ్వర్యంలో శ్రేణరా సంబరాలు చేసుకున్నారు. దశాబ్దాలుగా పశ్చిమ ప్రకాశం ప్రజల కోరిక నెరవేర్చిన సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఎరిక్షన్‌బాబు, నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.
సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
ఎర్రగొండపాలెం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం జిల్లాకు కేబినెట్ ఆమోదం తెలపడంతో మంగళవారం ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఆధ్వర్యంలో శ్రేణరా సంబరాలు చేసుకున్నారు. దశాబ్దాలుగా పశ్చిమ ప్రకాశం ప్రజల కోరిక నెరవేర్చిన సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఎరిక్షన్‌బాబు, నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, మండలపార్టీ అధ్యక్షుడు పోట్ల గోవింద్, మేకల వళరాజు, షేక్ మాబు, ఎం శ్రీనివాసరెడ్డి, టీడీపీ ముఖ్యనాయకులు నారాయణరెడ్డి, సత్యనారాయణగౌడ్, మం త్రునాయక్, దేవినేని చలమయ్య, క్లస్టర్ ఇన్‌చార్జులు పాల్గొన్నారు.
చంద్రబాబుకు జేజేలు
గిద్దలూరు టౌన్ : మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఆదేశాలతో పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. టీడీపీ నాయకులు ముత్తుముల కృష్ణకిశోర్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చే శారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమంలో గిద్దలూరు, కంభం మార్కెట్‌యార్డు చైర్మన్లు బైలడుగు బాలయ్య, పూనూరు భూపాల్‌రెడ్డి, జడ్‌పిటిసి బుడత మధుసూదన్, కొమరోలు, గిద్దలూరు మండల పార్టీల అధ్యక్షులు వెంకటేశ్వర్లు, మార్తాల సుబ్బారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు షానేషావలి ఉన్నారు.
పొదిలి : పొదిలిలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మంగళవారం పెద్దబస్టాండ్ సెంటర్‌లో టీడీపీ నాయకులు కేక్‌కట్ చేసి బాణసంచాకాల్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, పట్టణాధ్యక్షుడు ఖుద్దూస్ ఏఎంసీ చైర్మన్ ఇమాంసాహెబ్, అనిల్, యలమంద, భాస్కర్, ఓబులరెడ్డి, నాగేశ్వరరావు, రసూల్, యాసిన్, ముని శ్రీను, ఖాశిం, మెహరున్నీసా పాల్గొన్నారు.