Share News

తర్లుపాడు ఎంపీడీవో సస్పెన్షన్‌!

ABN , Publish Date - Sep 10 , 2025 | 01:31 AM

తర్లుపాడు ఎంపీడీవో చక్రపాణిప్రసాద్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. కార్యాలయంలో పనిచేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో కలెక్టర్‌ అన్సారియా ఆయనపై చర్యలు తీసుకున్నారు.

తర్లుపాడు ఎంపీడీవో సస్పెన్షన్‌!

మహిళపై లైంగిక వేధింపులే కారణం

తర్లుపాడు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : తర్లుపాడు ఎంపీడీవో చక్రపాణిప్రసాద్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. కార్యాలయంలో పనిచేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో కలెక్టర్‌ అన్సారియా ఆయనపై చర్యలు తీసుకున్నారు. తర్లుపాడు ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న మహిళపై జూలై 23న చక్రపాణిప్రసాద్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదైంది. అనంతరం దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టారు. ఆగస్టు 20న ఒంగోలు ఆర్డీవో విచారించి నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. ఈమేరకు చక్రపాణి ప్రసాద్‌ను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చినట్లు ఇన్‌చార్జి ఎంపీడీవో చంద్రశేఖర్‌ తెలిపారు.

Updated Date - Sep 10 , 2025 | 01:31 AM