Share News

వైసీపీకి తాళ్లూరు వైస్‌ ఎంపీపీ గుడ్‌బై

ABN , Publish Date - Nov 12 , 2025 | 11:33 PM

వైసీపీ సీనియర్‌ నాయకుడు, వైస్‌ఎంపీపీ యిడమకంటి వెంకటేశ్వరరెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు బుధవారం తెలిపారు. కష్ట పడి పని చేసే కార్యకర్తలకు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి వద్ద అవమానం తప్ప గౌరవం దక్కటం లేదన్నారు.నిజమైన కార్యకర్తలకు నియోజకవర్గంలో ఆదరణ లేనందునే వైసీపీని వీడుతున్నట్లు తెలిపారు.

 వైసీపీకి తాళ్లూరు వైస్‌ ఎంపీపీ గుడ్‌బై

తాళ్లూరు,నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ సీనియర్‌ నాయకుడు, వైస్‌ఎంపీపీ యిడమకంటి వెంకటేశ్వరరెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు బుధవారం తెలిపారు. కష్ట పడి పని చేసే కార్యకర్తలకు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి వద్ద అవమానం తప్ప గౌరవం దక్కటం లేదన్నారు.నిజమైన కార్యకర్తలకు నియోజకవర్గంలో ఆదరణ లేనందునే వైసీపీని వీడుతున్నట్లు తెలిపారు. వైసీపీ తన కుటుంబాన్నిగౌరవించి రెండు పర్యాయాలు వైస్‌ఎంపీపీగా పదవిని ఇచ్చిందన్నారు. పార్టీ అభ్యున్నతికి తన వంతు కృషి చేశానన్నారు.ఎమ్మెల్యే బూచేపల్లివద్ద కష్టపడి పని చేసే కార్యకర్తలకు తగిన గౌరవం, గుర్తింపు లేనందున వైసీపీని వీడాల్సి వచ్చిందన్నారు.

నేడు టీడీపీలో చేరిక

టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి సమక్షంలో గురువారం దర్శిలో తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరన్నుట్లు వైస్‌ఎంపీపీ తెలిపారు.

Updated Date - Nov 12 , 2025 | 11:33 PM