దెబ్బతిన్న ప్రతి ఎకరాకు పరిహారం అందేలా చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Oct 30 , 2025 | 11:32 PM
మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రతి ఎకరాకు నష్ట పరిహారం అందేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సూచించారు.
మార్కాపురం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రతి ఎకరాకు నష్ట పరిహారం అందేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సూచించారు. జవహర్‌నగర్ కాలనీలోని ఆయన స్వగృహంలో గురువారం మధ్యాహ్నం నియోజకవర్గంలోని అన్ని మండలాల వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో ప్రస్తుతం కొన్ని గ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఉఽధృతి తగ్గిన వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించాలని ఎమ్మెల్యే సూచించారు. గుండ్లకమ్మ నది, తెగిన చెరువులు, పొంగిన వాగులు, వంకలు ఉన్న ప్రాంతాల్లోని పొలాలను పరిశీలిస్తే తీవ్రత తెలుస్తుందన్నారు. రైతులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. వారికి పంటలను దక్కించుకునేందుకు అవసరమైన అన్ని సూచనలు క్షేత్రస్థాయి సిబ్బందితో ఇప్పించాలన్నారు. సమీక్షలో మార్కాపురం ఏడీఏ బాలాజీనాయక్, ఏవోలు పాల్గొన్నారు.