Share News

సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిట్‌

ABN , Publish Date - Aug 17 , 2025 | 02:39 AM

ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను పూర్తిగా అమలుచేసి కూటమి ప్రభుత్వం సూపర్‌ హిట్‌ అయిందని టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం అమలుచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం దర్శిలో భారీ ర్యాలీ నిర్వహించారు.

సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిట్‌
దర్శి-అద్దంకి రోడ్డులో భారీ ట్రాక్టర్ల ర్యాలీ (ఇన్‌సెట్‌లో) ట్రాక్టర్‌పై డాక్టర్‌ లక్ష్మి, లలిత్‌సాగర్‌

టీడీపీ దర్శి ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

‘అన్నదాత’లతో భారీ ట్రాక్టర్‌ ర్యాలీ

దర్శి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను పూర్తిగా అమలుచేసి కూటమి ప్రభుత్వం సూపర్‌ హిట్‌ అయిందని టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం అమలుచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం దర్శిలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దఎత్తున రైతులు ట్రాక్టర్‌లతో తరలివచ్చి పాల్గొన్నారు. అనంతరం స్థానిక మార్కెట్‌ యార్డులో జరిగిన రైతు పండుగ సభలో లక్ష్మి మాట్లాడారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందన్నారు. సీఎం చంద్రబాబు రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులతోపాటు అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. నన్ను నాన్‌లోకల్‌ అని విమర్శించిన కొంతమంది వైసీపీ నాయకులు ఎంతమేరకు అందుబాటులో ఉంటున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తాను దర్శి నియోజకవర్గంలో నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకాన్ని దర్శి మండలం, తూర్పువీరాయపాలెంలో ప్రారంభించిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభలకు వెళ్లేందుకు భయపడుతున్న వ్యక్తులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌చైర్మన్‌ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌, ఏఎంసీ చైర్మన్‌ దారం నాగవేణి, సుబ్బారావు, మున్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి, కురిచేడు, దొనకొండ, తాళ్ళూరు ముండ్లమూరు మండలాల టీడీపీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, పిడతల నెమలయ్య, మోడి ఆంజనేయులు, మేడగం వెంకటేశ్వరరెడ్డి, కూరపాటి శ్రీనివాసరావు, తెలుగుమహిళ నాయకురాలు శోభారాణి, దర్శి డిస్ర్టిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ కె.వెలుగొండారెడ్డి, దర్శి పట్టణ అధ్యక్షుడు పుల్లలచెరువు చిన్నా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 02:39 AM