Share News

సూపర్‌ సేవింగ్స్‌తో ప్రజలకెంతో మేలు

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:13 PM

సూపర్‌ జీఎస్టీ అమలుతో ప్రజలకెంతో మేలు చేకూరనుందని పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్‌ ఫిరోజ్‌ చెప్పారు. పట్టణంలోని విజేత జూనియర్‌ కళాశాలలో బుధవారం విద్యార్థులకు సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.

సూపర్‌ సేవింగ్స్‌తో ప్రజలకెంతో మేలు
సూపర్‌ జీఎస్టీపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఫిరోజ్‌, జంషీర్‌

పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఫిరోజ్‌

కనిగిరి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : సూపర్‌ జీఎస్టీ అమలుతో ప్రజలకెంతో మేలు చేకూరనుందని పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్‌ ఫిరోజ్‌ చెప్పారు. పట్టణంలోని విజేత జూనియర్‌ కళాశాలలో బుధవారం విద్యార్థులకు సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో నిత్యావసర సరుకులు, ఎలక్ర్టానిక్‌ పరికరాలు, వ్యవసాయ పరికరాల ధరలు చాలా తగ్గాయన్నారు. దీంతో ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్గుతోందని చెప్పారు. అదేవిధంగా గృహనిర్మాణాలకు అవసరమైన సామగ్రితోపాటు వస్తువులు ఎంతో రేటు తగ్గాయన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ఒక్కో హామీని సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా జరగని అభివృద్ధిని ఒక ఏడాదిలో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి చేసి చూపించారన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ రాష్ట్ర నాయకులు జంషీర్‌, క్లస్టర్‌ ఇంచార్జి బుల్లా బాలబాబు, కోఆప్షన్‌ మాజీ సభ్యుడు షరీఫ్‌, తెలుగు యువత అధ్యక్షుడు అచ్చాల రవి, 10వ వార్డు ఇంచార్జి మిన్నూ, నాగ, మురళీ, విజేత కళాశాల ప్రిన్సిపాల్‌ అరుణోధర్‌, ఏలూరి సుబ్బారావు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 11:13 PM