పంగులూరులో సూపర్‌లీగ్ ఖోఖో పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:11 PM
క్రీడలలో గ్రామీణ యువత ఉత్సాహంగా పాల్గొనాలని మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ ఛైర్మన్ డాక్టర్ బి.సిహెచ్.గరటయ్య కోరారు.
పంగులూరు, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి) : క్రీడలలో గ్రామీణ యువత ఉత్సాహంగా పాల్గొనాలని మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ ఛైర్మన్ డాక్టర్ బి.సిహెచ్.గరటయ్య కోరారు. పంగులూరులోని ఎంఎ్‌సఆర్ అండ్ బీఎన్‌ఎం జూనియర్ కళాశాలలో ఎస్‌ఆర్‌ఆర్ ఖోఖో అకాడమీ నిర్వహిస్తున్న సూపర్‌లీగ్ ఖోఖో పోటీలను సోమవారం డాక్టర్ గరటయ్య ప్రారంభించారు. అకాడమీ నిర్వాహకులు కె.కె.ఎ్‌ఫ.ఐ ఉపాధ్యక్షుడు సీతారామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభసభలో గరటయ్య మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలలో రాణించిన యువతకు విద్య, ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పించి ప్రోత్సహిస్తోందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించారని, ఆరుసార్లు రాష్ట్ర, మూడుసార్లు జాతీయస్థాయి ఖోఖో పోటీలను స్థానిక ప్రజల సహకారంతో పంగులూరులో విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. ప్రోకబడ్డీ తరహాలో పంగులూరు కేంద్రంగా ప్రో ఖోఖో పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పూర్వవిద్యార్థిని, రాజస్థాన్ యువతి బీజియా నృత్య ప్రదర్శన, మహిళల కోలాట ప్రదర్శన అలరించాయి. కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బత్తుల వీరనారాయణ, రాయిణి రామారావు, ప్రిన్సిపాల్ ఉషారాణి, క్లబ్ ప్రతినిధులు షేక్ కాలేషావలి, వీరరాఘవయ్య, ఆర్.వి.సుబ్బారావు, అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు శివారెడ్డి, సౌజన్య, ప్రజాకళాకారుడు నందవరపుజాన్ పాల్గొన్నారు.