Share News

కనిగిరిలో సూపర్‌ హిట్‌ సంబరాలు..!

ABN , Publish Date - Sep 11 , 2025 | 02:10 AM

సూపర్‌సిక్స్‌ - సూపర్‌హిట్‌’ సంబరాలు కనిగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి. స్థానిక అమరావతి ప్రాంగణంలో తెలుగు మహిళలు వినూత్నంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రకాల రంగుల ముగ్గులతో ప్రాంగణంలో 6 అంకెను వేసి బాబు సూపర్‌ అంటూ తీర్చిదిద్దిన లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కనిగిరిలో సూపర్‌ హిట్‌ సంబరాలు..!
సూపర్‌ సిక్స్‌ లోగో చుట్టూ సంబరాలు చేస్తున్న తెలుగు మహిళలు

తెలుగు మహిళల వినూత్న కార్యక్రమం

కనిగిరి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) :‘సూపర్‌సిక్స్‌ - సూపర్‌హిట్‌’ సంబరాలు కనిగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి. స్థానిక అమరావతి ప్రాంగణంలో తెలుగు మహిళలు వినూత్నంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రకాల రంగుల ముగ్గులతో ప్రాంగణంలో 6 అంకెను వేసి బాబు సూపర్‌ అంటూ తీర్చిదిద్దిన లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పాల్గొన్న తెలుగు మహిళలు కరణం అరుణ, షేక్‌ వాజిదా బేగంలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబునాయుడు ఒక్కొక్కటిగా నెరవేర్చారన్నారు. వాటిల్లో ప్రధానంగా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు, స్ర్తీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం ద్వారా బిడ్డల చదువులకు నగదు జమ, అన్నదాత సుఖీభవ ఉన్నాయన్నారు. చంద్రబాబు అడుగు జాడల్లోనే కనిగిరి ఎమ్మెల్యేగా డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ఏడాదిలోనే ఎంతో అభివృద్ధి చేసి చూపించారన్నారు. ప్రాంగణంలో మహిళలు, టీడీపీ నేతలు పెద్దఎత్తున పాల్గొని సూపర్‌సిక్స్‌ పథకాల వివరాలను తెలియచేస్తూ, ప్లకార్డులను ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళలు తులసి, స్వప్న, దొరసాని, ధనలక్ష్మి, నారాయణమ్మ, నీరజ, లక్ష్మీ, పార్వతి పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 02:10 AM