Share News

ఒంగోలులో ‘సుందరకాండ’ సందడి..!

ABN , Publish Date - Aug 31 , 2025 | 10:55 PM

వెంకటేష్‌ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుందరకాండ’ చిత్రం యూనిట్‌ ఆదివారం ఒంగోలులో సందడి చేసింది. స్థానిక గోరంట్ల మల్టీప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.

ఒంగోలులో ‘సుందరకాండ’ సందడి..!

కేక్‌ కట్‌ చేసి సంతోషాలు పంచుకున్న చిత్రం యూనిట్‌

అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే దామచర్ల

వెంకటేష్‌ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుందరకాండ’ చిత్రం యూనిట్‌ ఆదివారం ఒంగోలులో సందడి చేసింది. స్థానిక గోరంట్ల మల్టీప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. హీరో నారా రోహిత్‌, హీరోయిన్‌ వీర్తి, దర్శకుడు వెంకటేష్‌, నిర్మాత శ్యామ్‌తోపాటు పలువురు చిత్ర యూనిట్‌లు కేక్‌ కట్‌చేసి సంతోషాటు పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో రోహిత్‌ మీడియాతో మాట్లాడుతూ మంచి కథతో వచ్చిన చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారఅన్నారు. అందుకు నిదర్శనమే సుందరకాండ చిత్రం అని చెప్పారు. సుందరకాండ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, ఈ చిత్రం విజయం ప్రేక్షకులదే అని పేర్కొన్నారు. మంచి కథలు వస్తే ఎవరితోనైనా నటించడానికి సిద్ధమేనన్నారు. ఇప్పటికే అయిదారు కథలు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే వివరాలు ప్రేక్షకులకు తెలియజేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ రోహిత్‌ ఎప్పుడు మంచి చిత్రాలు తీస్తారన్నారు. రోహిత్‌ నటించిన సుందరకాండ కుటుంబ సమేతంగా వీక్షించామని చెప్పారు. కార్యక్రమంలో గోరంట్ల యజమానులు గోరంట్ల వీరనారాయణబాబు, ఓంకార్‌,టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పఠాన్‌ హనీ్‌ఫఖాన్‌తోపాటు రోహిత్‌ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానుల మధ్య చిత్రం యూనిట్‌, ఎమ్మెల్యే దామచర్ల కేక్‌ కట్‌ చేశారు.

- ఒంగోలు కార్పొరేషన్‌ (ఆంధ్రజ్యోతి)

Updated Date - Aug 31 , 2025 | 10:55 PM