విద్యార్థులు సృజనాత్మకతను పెంచుకోవాలి
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:08 PM
ప్రాథమిక ఉన్నతస్థాయిలో విద్యను అభ్యసించే సమయంలోనే విద్యార్థులలో ప్రయోగాలు చేయాలన్న ఆసక్తి కలగాలని ఎంఈవో వస్రాం నాయక్ అన్నారు.
మార్టూరు, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ప్రాథమిక ఉన్నతస్థాయిలో విద్యను అభ్యసించే సమయంలోనే విద్యార్థులలో ప్రయోగాలు చేయాలన్న ఆసక్తి కలగాలని ఎంఈవో వస్రాం నాయక్ అన్నారు. గురువారం మార్టూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సైన్స్ ఫెయిర్ ఎగ్జ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కార్య క్రమంలో మండలంలోని వివిధ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు తయారు చేసిన నమూనాలను ప్రదర్శించారు. వాటిని పరిశీలించిన ఎంఈవో విద్యార్థులను అభినం దించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడు తూ ప్రయోగాలకు విద్యార్థి దశ కీలక మన్నా రు. అనంతరం ఈ నమూనాలలో వ్యక్తిగత విభాగంలో వలపర్ల హైస్కూల్‌కు చెందిన విద్యార్థి కే.వెంకటవేద ఏర్పాటుచేసిన నమూ నా, .గ్రూపు విభాగంలో ద్రోణాదుల హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయ విభాగంలో చిమ్మిరిబండ హైస్కూల్‌కు చెందిన డి.అనూరాధలు ఏర్పాటు చేసిన నమూ నాలు మొదటి స్థానాలను పొందాయి. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రూత్ మెర్సీ జాయ్‌ు, ఉపాధ్యాయు లు గిరి, వెంకట్రామయ్య, కరిముల్లా పాల్గొన్నారు.
కారంచేడు : కారంచేడు వై.ఎన్. ప్రభుత్వ ఉన్నత పాఠ శాలలో కెరీర్ యాక్టివిటీస్ (వృత్తి మేళా మహోత్సవం)పై గురువారం మినీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో విద్యార్థులు వారి అభిరుచికి అనుగుణం గా చేపట్టనున్న రంగాలపై నిర్వహించిన ప్రదర్శల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయా ప్రదర్శనల్లో ప్రతిభ కనపరిచిన విద్చార్థులకు పోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఈవో మొలబంటి వెంకటేశ్వర్లు మాట్లాడు తూ విద్యార్థులో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మినీ ఎగ్జిబిషన్ పోటీలు ఎంత గానో దోహద పడతాయన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సామ్రాజ్యం, గేరా వినోల కుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.