Share News

ఆర్టీసీ బస్సు రద్దుతో విద్యార్థుల వెతలు

ABN , Publish Date - Aug 05 , 2025 | 01:26 AM

ఏబీసీ కాలువపై వంతెన నిర్మాణ పనులు జరుగు తున్నాయి. రెండు రోజుల క్రితం కాలువ వద్ద ఏర్పాటు చేసిన డైవర్షన్‌ నీటి ఉదృతితో కొట్టు కు పోయింది.

ఆర్టీసీ బస్సు రద్దుతో విద్యార్థుల వెతలు

బల్లికురవ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ఏబీసీ కాలువపై వంతెన నిర్మాణ పనులు జరుగు తున్నాయి. రెండు రోజుల క్రితం కాలువ వద్ద ఏర్పాటు చేసిన డైవర్షన్‌ నీటి ఉదృతితో కొట్టు కు పోయింది. దీంతో అద్దంకి నుంచి వల్లాపల్లి బల్లికురవ మీదుగా నర్సారావుపేట ఆర్టీసీ బస్సును అధికారులు రద్దు చేశారు. దీంతో నిత్యం బల్లికురవ వైపు నుంచి సంతమాగు లూరు వైపు వెళ్లే పాఠశాల విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అద్దంకి నుంచి కొమ్మినేనివారి పాలెం నుండి బస్సు వచ్చే వీలు ఉన్న ఆర్టీసీ అధికారులు తమ ఇబ్బందులను పట్టించుకోకుండా వంతెన పనులు వంక చూపించి బస్సును రద్దు చేశారని విద్యార్థులు వాపోతున్నారు. ఈ రోడ్డులో నర్సారావుపేట వెళ్లేందుకు ఎకైక బస్సు ఉందని ఉన్న బస్సును కూడా రద్దు చేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్ర యాణికులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు తీరు ఇలానే ఉంటే తాము రోడ్లపై దర్నాలు చేసేందుకు సిద్ధం అని పలువురు అంటు న్నారు. ప్రతి రోజు విద్యార్థులు బల్లికురవ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల నుంచి ఏడు కిలోమీటర్ల మేర నడిచి ఇళ్లకు వెళుతున్నారు. అధికారులు వెంటనే నర్సారావుపేట బస్సును కొమ్మినేవారిపాలెం మీదుగా వచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Aug 05 , 2025 | 01:26 AM