ఇంటర్ పరీక్షల్లో విద్యార్థుల సత్తా
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:49 AM
శనివారం ప్రకటించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలలో కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు సత్తాచాటారు.

కంభం, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): శనివారం ప్రకటించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలలో కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు సత్తాచాటారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం హెచ్‌ఈసీ విభాగంలో తమ్మినేని చాతుర్య 980/1000 మార్కులు సాధించి కళాశాలకు గుర్తింపు తెచ్చారు. ఆమెను కళాశాల ప్రిన్సిపాల్ సైమన్‌విక్టర్ అభినందించారు. ఇంటర్ అడ్మిషన్ సమయంలో సైన్స్ గ్రూపు తీసుకోవాలని పలువురు సూచించినప్పటికీ, హెచ్‌ఈసీ గ్రూపు తీసుకుని టాపర్‌గా నిలిచారు. సివిల్స్, గ్రూప్స్ పోటీల్లో నెగ్గుతానని చాతుర్య ధీమా వ్యక్తం చేస్తోంది కాగా కళాశాల నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం 199 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 72 మంది, ద్వితీయ సంవత్సరం 127 మంది పరీక్షలు రాయగా 64 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
కంభం: ఇంటర్ ఫలితాలలో గౌతమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు ద్వితీయ సంవత్సర బైపీసీ ఫలితాల్లో ఎం.త్రిలోకేశ్వరి 990/1000 టి.మేరి 989/1000 మార్కులతో తమ సంస్థకు గుర్తింపు తెచ్చినట్లు కరస్పాండెంట్ చేగిరెడ్డి రామభూపాల్‌రెడ్డి తెలిపారు. వాసవి విద్యాసంస్థల విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో ఎస్.లాస్యరెడ్డి 463 మార్కులు, బైపీసీలో బి.వి.రంగ మధుప్రియ 433 మార్కులు, సీఈసీలో టి.శ్రీలక్ష్మీచైతన్య 485 మార్కులు, ద్వితీయ సంవత్సర ఎంపీసీ విభాగంలో టి.రోషిణి 987 మార్కులు బైపీసీలో టి.శివాణి 977 మార్కులు సాధించగా కళాశాల కరస్పాండెంట్ గోళ్ళ సుబ్బరత్నం (బాబు), ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి అభినందించారు.
కమలా విద్యార్థుల ప్రతిభ
మార్కాపురం వన్‌టౌన్ : మార్కాపురంలోని కమలా జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో ప్రతిభ కనబర్చారు. ఎంపీసీ విభాగంలో అశోక్ 465, బైపీసీ విభాగంలో షేక్ షాహిన్ 440కి 433 మార్కులు సాధించారని ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. రెండో సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో విష్ణుసాయి ప్రణవ్ 982, బైసీపీ విభాగంలో కిరణ్ 978 మార్కులు సాధించారని తెలిపారు.
ఎర్రగొండపాలెం : ఎర్రగొండపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలో 107 మంది విద్యార్థులకు 47 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షకు 79 మంది విద్యార్ధులు పరీక్షకు హజరుకాగా 56 మంది ఉత్తీర్ణులై 71శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ స్వరూపరాణి తెలిపారు.
యశ్వంత్‌నాయక్ ప్రతిభ
గిద్దలూరు : మండలంలోని బురుజుపల్లి తండాకు చెందిన బుక్కె యశ్వంత్‌నాయక్‌కు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్ష ఫలితాలలో సత్తా చాటారు. ఎంపీసీ విభాగంలో 467/470 మార్కులు సాధించాడు. యశ్వంత్‌నాయక్ తండ్రి కృష్ణనాయక్ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందగా తల్లి మంగమ్మ గిద్దలూరు బాలికోన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డ్‌నేట్‌గా పనిచేస్తోంది. తండ్రి ఆశయాన్ని, కష్టాన్ని చూసి చదువు పట్ల యశ్వంత్‌నాయక్ శ్రద్ద పెట్టి చదువుతున్నాడు. 10వ తరగతి వరకు స్థానికంగానే చదివిన యశ్వంత్‌నాయక్ ఇంటర్మీడియట్ విజయవాడ చైతన్య కళాశాలలో చేరాడు. ఐఐటిలో సీటు సాధించడమే ధ్యేయమని పేర్కొన్నారు.
కొమరోలు విద్యార్థుల సత్తా
కొమరోలు మండలంలోని రాజుపాలెం కస్తుర్భా విద్యాలయంలో 90 శాతం ఉత్తీర్ణత సాధించారని ద్వితీ య సంవత్సరం పీవీ రేణుక 907మార్కులు, ప్రథమ సంవత్సరం విద్యార్ధి పీవీ ఐశ్వర్య 405మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ మందా రోజ్‌సులోచన తెలిపారు. కొమరోలు జూనియర్ కళాశాలలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ విద్యార్ధి కే భూవర్షిణి 453మార్కులు, బైపీసీ విద్యార్థి అఖిల 382మార్కులు, సీఈసీ విద్యార్ధి ప్రకాశ్‌రావు 378 మార్కులు, ద్వితీయ సంవత్సరం ఎంపీసీ కే.తబిత 949మార్కులు, బైపీసీ విద్యార్ధి షేక్ జమాల్ భాష 939 మార్కులు, సీఇసీ విద్యార్ధి షేక్ ముంతాజ్ 924మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ ప్రభాకర్ తెలిపారు. మండలంలోని బాదినేని పల్లి గ్రామానికి చెందిన గర్రె అజయ్‌కుమార్ 463 మార్కులు, కొమరోలులోని పసుపులేటి సౌమ్యశ్రీ ఎంపీసీలో 465 మార్కులు, మండలంలోని రెడ్డిచర్ల గ్రామానికి చెందిన బందెల స్టాన్లీ సెబాస్టిన్ 462 మార్కులు, అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన కృష్ణసాగర్‌రెడ్డి 932మార్కులు సాధించారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో
పొదిలి : ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. మొదటి సంవత్సరం 30శాతం, ద్వితీయ సంవత్సరం 55శాతం ఉత్తీర్ణత కనబరిచినట్లు ప్రిన్సిపల్ రామలక్ష్మీ తెలిపారు.
పెద్దదోర్నాల : ప్రభుత్వం శనివారం ప్రకటించిన ఇంటర్మిడియట్ పరీక్షా ఫలితాలలో ప్రభుత్వ కళాశాలల విద్యార్ధులు రాణించారు. మోడల్ స్కూల్‌కు చెందిన కే శివగాయత్రీ ద్వితీయ సంవత్సరంలో 952 మార్కులు సాధించింది. పాఠశాలలో ద్వితీయ సంవత్సం విద్యార్ధులు మొత్తం 33 మంది పరీక్షలు వ్రాయగా నూరు శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.ఎంపీసీ విభాగంలో కే శివగాయత్రీ 100కి 952మార్కులు సాధించింది.బైపీసీలో డీ ఫాతిమా 840 మార్కులు సాధించింది.మొదటి సంవత్సరంలో 53 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరు కాగా 43 మంది ఉత్తీర్ణులయ్యారు.దీంతో 82శాతం ఉత్తీర్ణత నమోదయింది.ఎంపీసీలో జీ సుజిత 402 మార్కులు,బైపీసీలో ఎం భార్గవి 398, ఎంఈసీలో ఎన్ పూజిత 377మార్కులు సాధించారు.కస్తూర్భాలో మొదటి సంవత్సరం 27 మంది విద్యార్ధులు హాజరు కాగా 17 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో 62.96శాతం, ద్వితీయంలో 11 మంది రాయగా 10 మంది ఉత్తీర్ణుయ్యారు. 90.91 శాతం ఉత్తీర్ణత నమోదయింది.