దారిలేక విద్యార్థులకు ఇక్కట్లు
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:03 PM
మద్దిపాడు కడియాల యానాదయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వెళ్లడానికి సరైన దారికి అవకాశం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మద్దిపాడు, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : మద్దిపాడు కడియాల యానాదయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వెళ్లడానికి సరైన దారికి అవకాశం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ప్రధాన ద్వారం నుంచి కళాశాల వరకు ఉన్న బాట మొత్తం నీటితో నిండిపోయింది. ఈ క్రమంలో దాతలు ఎవరైనా స్పందించి రహదారి ఏర్పాటుకు సహకరించాలని ప్రధానోపాధ్యాయుడు మాల్యాద్రి కోరారు.