Share News

విద్యార్థుల విహారయాత్ర

ABN , Publish Date - Nov 23 , 2025 | 10:40 PM

కనిగిరి ప్రాంతంలో విద్యాభివృద్ధికి బాటలు వేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి విద్యార్థులకు విహారయాత్ర ఏర్పాటుచేశారు. విద్యార్థుల సంతోషం కోసం విహారయాత్ర ఏర్పాటుకు తన సొంత నిధులను వెచ్చించి ఏర్పాట్లుచేశారు.

విద్యార్థుల విహారయాత్ర
బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తున్న డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర సహకారంతో ఏర్పాట్లు

కనిగిరి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): కనిగిరి ప్రాంతంలో విద్యాభివృద్ధికి బాటలు వేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి విద్యార్థులకు విహారయాత్ర ఏర్పాటుచేశారు. విద్యార్థుల సంతోషం కోసం విహారయాత్ర ఏర్పాటుకు తన సొంత నిధులను వెచ్చించి ఏర్పాట్లుచేశారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆదివారం విహారయాత్రకు ఏర్పాట్లు చేయించారు. గతంలో మోడల్‌స్కూల్‌కు వెళ్ళాలంటే రోడ్డు మార్గం సక్రమంగా లేదు. దీంతో విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని తారు రోడ్డును వేయించారు. అలాగే, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించటంతో పాటు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ఈక్రమంలో తన సొంత నిధులతో పది బస్సుల్లో ఉచిత విహారయాత్రకు ఎమ్మెల్యే సహకరించటం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ బాలికల పాఠశాల హెచ్‌ఎం కలవ విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 10:40 PM