Share News

ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:32 AM

ప్రజలకు మెరు గైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పట్టణంలోని తీగెలగొందిలో రూ.కోటి పది లక్షలతో నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను (రైతుబజార్‌) గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు.

ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి
రైతు బజార్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరు గైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పట్టణంలోని తీగెలగొందిలో రూ.కోటి పది లక్షలతో నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను (రైతుబజార్‌) గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలకాలంగా కూరగాయల మా ర్కెట్‌ ఏర్పాటు కనిగిరివాసులకు కలగా మారింద న్నారు. తాను 2009 నుంచి 2014వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు చెప్పారు. ఆసమయం లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు చె ప్పారు. కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేయలేక పోయానని తరచూ మదనపడే వాడినన్నారు. కూ టమి ప్రభుత్వంలో కూరగాయల మార్కెట్‌ (రైతుబ జార్‌) అన్ని విధాల అందరికీ ఆమోదమైన ప్రదేశంలో ఏర్పాటుచేశామన్నారు. రైతుబజార్‌ ఏర్పాటుతో రైతులు తాము పండించిన పంటను దళారీలు లేకుండా నేరు గా అమ్ముకునే వీలుంటుందన్నారు. అదేసమయంలో మంచి నాణ్యమైన తాజా కూరగాయలను కొనుక్కు నేందుకు ప్రజలకు అవకాశం ఉంటుందన్నారు. పట్టణం లో ప్రధాన సెంటరైన బొ డ్డుచావిడి వద్ద రోడ్డు పక్క న కూరగాయల అమ్మకాలు సాగించటంవల్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నా యన్నారు. ఇకనుంచి అ లాంటి సమస్యలకు తావు లేకుండా ఉంటుందన్నారు. జూలై మెదటి వారంలో రై తు బజార్‌ ప్రారంభానికి ఏ ర్పాట్లు చేస్తున్నట్టు చెప్పా రు. పజలందరూ రైతుబజా ర్‌ను సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. ఎమ్మె ల్యే వెంట నాయకులు షీ ప్‌యార్డ్‌ చైర్మన్‌ తోడేటి గో పి, బాలు ఓబులురెడ్డి, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్‌ ఆపీసర్‌ ఎం.వరలక్ష్మి, ఎస్‌ఎంఏ ప్రతాప్‌, కార్యదర్శి రవిచంద్ర పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 12:32 AM