పోలియో రహిత సమాజానికి కృషి
ABN , Publish Date - Dec 21 , 2025 | 10:23 PM
పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. ఆదివారం గిద్దలూరు రైల్వేస్టేషన్‌లో నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రారంభించారు.
చిన్నారులకు చుక్కలు వేసి ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. ఆదివారం గిద్దలూరు రైల్వేస్టేషన్‌లో నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా పలువురు చిన్నారులకు చుక్కల మందు వేశారు. ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లలు పోలియో భారిన పడకుండా వారి బంగారు జీవితానికి రెండు చుక్కలు వేయించాలని సూచించారు. దేశాన్ని పోలియో రహితంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేస్తున్నాయన్నారు. కార్యక్రమం ద్వారా చిన్నారులకు జీవితాంతం ఆరోగ్యాన్ని అందించ గలుగుతామని, తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలంటే ఈ రెండు చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు షానేషావలి, బీజేపీ నాయకులు పిడతల రమే్‌షరెడ్డి పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం : పిల్లలకు చుక్కల మందు వేసి పోలియాను శాశ్వతంగా నిర్మూలిద్దామని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఎర్రగొండపాలెం గ్రామ పంచాయతీ వద్ద పోలియో కేంద్రంలో ఆదివారం చిన్నారులకు ఆయన చుక్కల మందు వేశారు. పోలియో రహిత సమాజం కోసం ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టరు పీ చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, టీడీపీ మండల అధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి, టీడీపీ ముఖ్యనాయకులు వేగినాటి శ్రీను, శనగా నారాయణరెడ్డి, కంచర్ల సత్యనారాయణగౌడ్,తోట మహేష్, కొత్తమాసు సుబ్రమణ్యం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వెంకటాద్రిపాలెం పరిధిలో 4386 మందికిగాను 4189 మందికి పోలియో చుక్కలు వేసి 96 శాతం నమోదు చేసినట్లు వైద్యాధికారి పీ చంద్రశేఖర్ తెలిపారు.