Share News

స్థానిక సంస్థలు బలోపేతం

ABN , Publish Date - Oct 25 , 2025 | 01:00 AM

స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకు అవసరమైన చర్యలు తీసుకొంటోంది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీల అభివృద్ధిపై దృష్టిపెట్టింది.

స్థానిక సంస్థలు బలోపేతం

ఆ దిశగా ప్రభుత్వం అడుగులు

డీడీవో కార్యాలయాల ప్రారంభానికి సన్నాహాలు

పంచాయతీల క్లస్టర్‌ విధానం రద్దు

ఒంగోలు కలెక్టరేట్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకు అవసరమైన చర్యలు తీసుకొంటోంది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీల అభివృద్ధిపై దృష్టిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు క్లస్టర్‌ విధానంలో పనిచేస్తుండగా దానిని రద్దు చేసి స్వతంత్ర యూనిట్లుగా ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారి (డీడీవో) కార్యాలయాలను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలను వాటి పరిధిలోకి తెచ్చే విధంగా చర్యలు చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసింది.లు నిర్వీర్యం కావడంతోపాటు పంచాయతీలకు రావాల్సిన నిధులను కూడా దారి మళ్లించింది. దీంతో జిల్లాలోని 729 గ్రామపంచాయతీలు అంధకారంలోకి వెళ్లాయి. అయితే ప్రస్తుతం ఆయా పంచాయతీల్లో మెరుగైన పాలనను అందించేందుకు ుతీ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సహకారంతో గ్రామాలభివృద్ధికి నిధులను సమకూరుస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు పంచాయతీల ఆర్థిక స్వయంప్రతిపత్తి సాధించే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీల ద్వారా మెరుగైన పాలనను అందించడమే కాకుండా ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు వీలుగా చర్యలు చేపట్టారు.

Updated Date - Oct 25 , 2025 | 01:00 AM