స్త్రీశక్తి’ సూపర్ సక్సెస్
ABN , Publish Date - Aug 26 , 2025 | 10:44 PM
స్ర్తీశక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకం సూపర్ సక్సెస్ అయిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): స్ర్తీశక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకం సూపర్ సక్సెస్ అయిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహ ఆవరణలో జరిగిన కృతజ్ఞతా సదస్సులో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హమీలను తుచ తప్పకుండా అమలు చేయటంతో అన్నివర్గాల ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతుందన్నారు. సీఎం చంద్రబాబు మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత గ్యాస్, తల్లికి వందనం, స్ర్తీశక్తి పథకం అమలు చేయటంతో మహిళల్లో ఆనందం వ్యక్తమవుతుంద న్నారు. ఉచిత బస్సు పథకం ప్రారంభంనుంచి మహిళ ల ప్రయాణాల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. పథకం అమల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముం దుజాగ్రత్తగా అదనపు బస్సులు సమకూరుస్తున్నారని చెప్పారు. పనుల కోసం మహిళలు రాష్ట్రవ్యాప్తంగా బస్సుల్లో సంచరిస్తూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈనేపథ్యంలో కూటమి ప్రభుత్వంకు కృతజ్ఞత తెలియజేస్తూ మహిళల ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహిం చటం సంతోషంగా ఉందన్నారు. మహిళల అభ్యున్నతికి ఆహర్నిశలు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు, కూట మి ప్రభుత్వంకు మహిళలు అండగా నిలవాలని కోరా రు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చిత్రపటాలకు పాలభిషేకం చేశారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపా రావు, టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ కడి యాల లలిత్‌సాగర్, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, సుబ్బారావు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, వైస్‌చైర్మన్ జి.స్టీవెన్, దర్శి, కురిచేడు, దొనకొండ, తాళ్లూరు, ముండ్లమూరు మండలాల టీడీపీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు పి.నెమలయ్య, మోడి ఆంజనేయులు, మేడగం వెంకటేశ్వరరెడ్డి, కూరపాటి శ్రీనివాసరావు, దర్శి పట్టణ అధ్యక్షుడు పుల్లలచెరువు చిన్నా పాల్గొన్నారు. అలాగే, దర్శి డిస్ర్టిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు కె.వెలుగొండారెడ్డి, దర్శి, తూర్పువెంక టాపురం సొసైటీల అధ్యక్షులు కె.చంద్రశేఖర్, దామా కృష్ణ, రాష్ట్ర తెలుగు మహిళ నాయకురాలు ఎం.శోభా రాణి, దర్శి ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు ఇందిర, కౌన్సిలర్లు నారపుశెట్టి ధనలక్ష్మి, నక్కా చంద్ర, పసుపులేటి శేషమ్మ, ఇత్తడి సునీత, తదితరులు పాల్గొన్నారు.