వర్షాలకు పొంగుతున్న వాగులు
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:03 PM
దర్శి ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలకు నీరు చేరి జలమయమవుతున్నాయి. దర్శి పట్టణ సమీపంలో కాటేరువాగు వర్షం వచ్చిన ప్రతిసారీ పొంగి ప్రవహిస్తున్నది. ఈ కాటేరువాగు పూర్తిగా ఆక్రమణలకు గురికావటంతో ఈ దుస్థితి నెలకొంది. సుమారు 50 ఎకరాలకు పైగా విస్తీర్ణం కల్గిన ఈ కాటేరువాగు ఇరువైపులా ఆక్రమణలకు గురికావటంతో కుచించుకుపోయింది. వెడల్పు పూర్తిగా తగ్గటంతో భారీ వర్షం వచ్చినప్పుడు పొలాల్లో నీరంతా ఈ వాగులోకి చేరటంతో ముందుకు వెళ్లే వీలులేక దర్శి-పొదిలి ప్రధాన రహదారి బ్లాక్ అవుతోంది.
దర్శి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): దర్శి ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలకు నీరు చేరి జలమయమవుతున్నాయి. దర్శి పట్టణ సమీపంలో కాటేరువాగు వర్షం వచ్చిన ప్రతిసారీ పొంగి ప్రవహిస్తున్నది. ఈ కాటేరువాగు పూర్తిగా ఆక్రమణలకు గురికావటంతో ఈ దుస్థితి నెలకొంది. సుమారు 50 ఎకరాలకు పైగా విస్తీర్ణం కల్గిన ఈ కాటేరువాగు ఇరువైపులా ఆక్రమణలకు గురికావటంతో కుచించుకుపోయింది. వెడల్పు పూర్తిగా తగ్గటంతో భారీ వర్షం వచ్చినప్పుడు పొలాల్లో నీరంతా ఈ వాగులోకి చేరటంతో ముందుకు వెళ్లే వీలులేక దర్శి-పొదిలి ప్రధాన రహదారి బ్లాక్ అవుతోంది. కాటేరువాగు ప్రాంతంతో స్థలాల రేట్లు విపరీతంగా పెరిగాయి. అక్కడ సెంటు ధర రూ.10 లక్షలకు పైగా ఉంది. దీంతో అనేకమంది వాగు స్థలాన్ని ఆక్రమించుకొని గృహలు నిర్మించుకున్నారు. మరికొంతమంది ఇతర కట్టడాలు నిర్మించి స్వంత స్థలాల్లో కలుపుకున్నారు. దీంతో వర్షాలు వచ్చినప్పుడు కాటేరువాగు ఉధృతి ప్రమాదకరంగా మారింది. దర్శి-పొదిలి ప్రధాన రహదారిపై నీరు భారీగా నిలవటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. గతంలో ద్విచక్ర వాహన చోదకులు ఈ వాగులో కొట్టుకొనిపోయారు. చుట్టుపక్కల వారు ప్రమాదం నుంచి వారిని రక్షించటంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వాగు ఆక్రమణలను తొలగించాలని ప్రజలు ఎంతోకాలంగా కోరుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. అందువలన తరచూ కాటేరువాగు వర్షం పడినప్పుడల్లా పొంగుతోంది. గడియాస్తంభం సెంటర్‌లో రోడ్లపై పడిన నీరు మురుగు కాల్వలు లేకపోవటంతో రోడ్లపైనే నిలుస్తోంది. అధికంగా నీరు వస్తే తహసీల్దార్ కార్యాలయం కుంటలా మారుతోంది. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో కూడా వర్షంనీరు గ్రౌండ్‌లోకి చేరి నిల్వ ఉంటోంది. అధికారులు స్పందించి వాగుల ఆక్రమణలు తొలగించాలని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.