Share News

వ్యవసాయ కనెక్షన్లపై నిర్లక్ష్యం వీడండి

ABN , Publish Date - Sep 17 , 2025 | 02:24 AM

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల విషయంలో నిర్లక్ష్యం వీడాలని అధికారులను ఏపీ సీపీడీసీఎల్‌ సీఎండీ పి.పుల్లారెడ్డి హెచ్చరించారు. మంగళవారం స్థానిక విద్యుత్‌ భవన్‌లో జిల్లాలోని ఆశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

వ్యవసాయ కనెక్షన్లపై నిర్లక్ష్యం వీడండి
సమావేశంలో మాట్లాడుతున్న పుల్లారెడ్డి, పక్కన ఎస్‌ఈ వెంకటేశ్వర్లు

విద్యుత్‌ అధికారులతో సమీక్షలో సీపీడీసీఎల్‌ సీఎండీ పుల్లారెడ్డి

ఒంగోలుక్రైం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల విషయంలో నిర్లక్ష్యం వీడాలని అధికారులను ఏపీ సీపీడీసీఎల్‌ సీఎండీ పి.పుల్లారెడ్డి హెచ్చరించారు. మంగళవారం స్థానిక విద్యుత్‌ భవన్‌లో జిల్లాలోని ఆశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ ఆర్డీఎస్‌ఎస్‌ పనులను వేగవంతం చేయాలని కోరారు. వ్యవసాయ కనెక్షన్‌ల మంజూరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. సోలార్‌ రూఫ్‌టాప్‌ కనెక్షన్లు అధికంగా ఏర్పాటు చేసుకోవడం కోసం అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని కోరారు. నిత్యం ఫీడర్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలన్నారు. స్మార్ట్‌ మీటర్లపై ఉన్న అపోహలను తొలగించి అవగాహన కల్పించాలని సూచించారు. స్మార్ట్‌మీటర్ల వలన ఉపయోగాలు తెలియజేయా లన్నారు. పీఎం కుసుమ్‌ పథకం అమలు కోసం కావాల్సిన భూసేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. సమావేశంలో ఏపీ సీపీడీసీఎల్‌ డైరెక్టర్‌ మురళీకృష్ణ యాదవ్‌, ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 02:24 AM