Share News

మినీ బైపాస్‌ రోడ్డుకు వడివడిగా అడుగులు

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:54 PM

అద్దంకి పట్టణంలోని నామ్‌ రోడ్డుపై కొంత మేర ట్రాఫిక్‌ రద్ధీని తగ్గించేందుకు అద్దంకి మేజర్‌ కాలువ కట్టను మినీ బైపాస్‌గా మార్చే పనులకు అడుగులు ముందుకు పడుతున్నా యి.

మినీ బైపాస్‌ రోడ్డుకు వడివడిగా అడుగులు

అద్దంకి,డిసెంబరు7(ఆంధ్రజ్యోతి): అద్దంకి పట్టణంలోని నామ్‌ రోడ్డుపై కొంత మేర ట్రాఫిక్‌ రద్ధీని తగ్గించేందుకు అద్దంకి మేజర్‌ కాలువ కట్టను మినీ బైపాస్‌గా మార్చే పనులకు అడుగులు ముందుకు పడుతున్నా యి. కాలువ కట్టలపై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్న కుటుంబాలకు ఇళ్లస్థలాల కేటాయింపు పూర్తయ్యింది. అదే సమయంలో మొదటి దశలో మినీబైపాస్‌ నిర్మాణం జరిగే కాకానిపాలెం నుంచి శ్రీనగర్‌ వరకు సుమారు 1.5 కి.మీ దూరం 70 అడు గుల వెడల్పుతో కాలుకట్ట హద్దులను గుర్తి స్తూ సర్వే పూర్తి చేశారు. కాలువ కట్టలపై ఉన్న నివాసాలను కూడా ఈ నెల 20వ తేదీ లోపు స్వచ్చందంగా ఖాళీ చేసుకోవాలని మున్సిపల్‌ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు కుటుంబాలు వెంటనే ఇళ్లు ఖాళీ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. సుమారు రూ.17 కోట్ల వ్యయంతో అద్దంకి మేజర్‌ కాలువకు రెండు వైపులా కట్లలను సీసీ రోడ్లుగా మా ర్చడం, మధ్యలో పంట పొలాలకు నీరు చేరేలా కాలు వను ఉంచడం, సీసీ రోడ్లు పక్కన మురుగు కాలు వలు, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు చేసేలా డిజైన్‌ సిద్ధం చేశారు. ఈ క్రమంలో ముందు గా సర్వే చేసి హద్దులు నిర్ణయించిన వరకు మొత్తం వెడల్పుతో గ్రావెల్‌ రోడ్డు నిర్మాణానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఇళ్లు లేకుండా ఖాళీగా ఉన్న చోట చెట్లు తొలగించి శుభ్రం చేశారు. రెండు, మూడు రోజులలో గ్రావెల్‌ పనులు ప్రారంభించేం దుకు ఏర్పాటు చేస్తున్నారు. రెండవ దశలో కాకానిపాలెం నుంచి టిడ్కో ఇళ్ల మీదుగా శింగరకొండ వరకు తారు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉంది.

Updated Date - Dec 07 , 2025 | 11:54 PM