భైరవకోన మార్గంలో ముఖద్వారం ఏర్పాటుకు చర్యలు
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:01 PM
సీఎస్‌పురం మండలంలో ప్రముఖ పర్యాటక శైవ క్షేత్రమైన భైరవకోనకు వెళ్లేమార్గంలో ఏ కొత్తపల్లి గ్రామం వద్ద దుర్గా అమ్మవారి ముఖ ద్వారాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
సీఎస్‌పురం(పామూరు), ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సీఎస్‌పురం మండలంలో ప్రముఖ పర్యాటక శైవ క్షేత్రమైన భైరవకోనకు వెళ్లేమార్గంలో ఏ కొత్తపల్లి గ్రామం వద్ద దుర్గా అమ్మవారి ముఖ ద్వారాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి తెలిపారు. ముఖద్వారం నిర్మించబోయే ప్రదేశాన్ని టీడీపీ శ్రేణులతో కలిసి గురువారం పరిశీలించారు. ముఖద్వారం వద్ద డబుల్‌రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులకు సూచించారు. ముఖ ద్వారానికి మధ్య భాగంలో అమ్మవారి ఫొటోను, విద్యుత్ లైట్లను అమర్చేవిధంగా నిర్మాణం చేపట్టాలని సూచించారు. భైరవకోన క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బొమ్మనబోయిన వెంగయ్య, జిల్లా షీప్ సొసైటీ చైర్మన్ తోడేటి గోపి, మన్నేపల్లి కార్తీక్, చావా శేఖర్, ఏ.రామకృష్ణంరాజు, తదితరులు పాల్గొన్నారు.