Share News

జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లకు చర్యలు

ABN , Publish Date - Dec 11 , 2025 | 11:27 PM

ల్లాలో వరి ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ పి.రాజాబాబు తెలిపారు.

జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లకు చర్యలు

కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరి ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ పి.రాజాబాబు తెలిపారు. గురువారం అమరావతి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. ధాన్యం సేకరణతో పాటు జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు మరోవైపు జిల్లాలో పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపడుతున్నామని తెలిపారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు సంతృప్తి చెందేలా ప్రభుత్వ సేవలు అందించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా జిల్లాల్లో కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ప్రజలకు సులభతరంగా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు ఎం.వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, పద్మశ్రీ, వరలక్ష్మి, సీపీవో సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 11:27 PM