మత్స్యసంపదను పెంచేలా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:49 AM
జిల్లాలో 2025-26 సంవత్సరా నికి స్వర్ణాంధ్ర-47లో భాగంగా మత్య్ససంపదను పెంచేలా చర్యలు తీసుకోవా లని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు కలెక్టరేట్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2025-26 సంవత్సరా నికి స్వర్ణాంధ్ర-47లో భాగంగా మత్య్ససంపదను పెంచేలా చర్యలు తీసుకోవా లని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాల యంలో శుక్రవారం రాత్రి జిల్లా గ్రామీణాభివృద్ధి, నీటి యాజమాన్య సంస్థ, బీసీ కార్పొరేషన్ అధికారులతో ఆమె మాట్లాడారు. 2025-26 సంవత్సరానికి లక్ష్యాల ను సాధించేందుకు ఉపాది పథకం కింద గుర్తించిన అన్ని ప్రజానీటివనరుల్లో క్యాప్టివ్ సీడ్ నర్సరీలను ఏర్పాటు చేసేందుకు మత్య్సశాఖ, డ్వామా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మత్య్సకారుల జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అధికారులు శ్రీ నివాసరావు, నారాయణ, జోసఫ్‌కుమార్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.