స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఫలితాలలో మార్టూరు యువకులకు ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:14 AM
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలు 2024 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. మార్టూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులకు ఆల్ ఇండియా ర్యాంకులు లభించాయి. వారిలో కనిశెట్టి లీలా అవినాష్‌కు 9వ ర్యాంకు, ముక్తిపాటి శ్రీకాంత్ 818వ ర్యాంకు సాధించారు. అదేవిదంగా లీలా అవినాష్‌కు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కంటాక్స్ అధికారిగా, ముక్తిపాటి శ్రీకాంత్‌కు ఢిల్లీలో సెంట్రల్ సెక్రటేరియేట్ సర్వీస్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా సెలెక్ట్ అయ్యారు. వారిలో లీలా అవినాష్ తండ్రి కనిశెట్టి లక్ష్మయ్య గతంలోనే చనిపోగా తల్లి, చంద్రమధులత ప్రస్తుతం ఇడుపులపాడులో పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్నారు.

మార్టూరు, మార్టూరు 13 (ఆంధ్రజ్యోతి) : స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలు 2024 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. మార్టూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులకు ఆల్ ఇండియా ర్యాంకులు లభించాయి. వారిలో కనిశెట్టి లీలా అవినాష్‌కు 9వ ర్యాంకు, ముక్తిపాటి శ్రీకాంత్ 818వ ర్యాంకు సాధించారు. అదేవిదంగా లీలా అవినాష్‌కు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కంటాక్స్ అధికారిగా, ముక్తిపాటి శ్రీకాంత్‌కు ఢిల్లీలో సెంట్రల్ సెక్రటేరియేట్ సర్వీస్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా సెలెక్ట్ అయ్యారు. వారిలో లీలా అవినాష్ తండ్రి కనిశెట్టి లక్ష్మయ్య గతంలోనే చనిపోగా తల్లి, చంద్రమధులత ప్రస్తుతం ఇడుపులపాడులో పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్నారు. మార్టూరు లోని శ్రీహర్షిణి విద్యాసంస్థలో 10 వతరగతి, ఇంటర్ చదవగా జేఎన్‌టీయూ నరసరావుపేటలో సీఎస్‌ఈలో బీటెక్ చేశారు. అదేవిధంగా మార్టూరు నేతాజీనగర్‌కు చెందిన శ్రీకాంత్ తండ్రి ముక్తిపాటి సుబ్బారావు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. శ్రీకాంత్ 10 వతరగతి వరకు దర్శిలో, ఇంటర్ విజయవాడ నారాయణ కాలేజీలో, గుంటూరులోని ఆర్‌వీఆర్ జేసీ కాలేజీలో బీటెక్ సీఎస్‌ఈ కోర్సు చేశారు. ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన ఇద్దరు యువకులుకు చెందిన మార్టూరు గ్రామంలోని వారి కుటుంబాలలో ఆనందాలు వెల్లి విరిసాయి.బందువులకు, స్నేహితులకు వారి కుటుంబసభ్యులు మిఠాయిలు పంచిపెట్టారు. అంతేగాకుండా పలువురు వారిద్దరి కుటుంబ సభ్యులను అభినందించారు.