శ్రీశైలం మండలాన్ని మార్కాపురం డివిజన్‌లో విలీనం చేయాలి
ABN , Publish Date - Jun 30 , 2025 | 11:01 PM
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మండలాన్ని మార్కాపురం డివిజన్‌లో విలీనం చేయాలని టీడీపీ పోల్ మేనేజిమెంట్ ఇన్‌చార్జి కందుల రామిరెడ్డి, పాస్ సంస్థ నాయకులు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్‌కు వినతిపత్రం ఇచ్చారు.
మార్కాపురం వన్‌టౌన్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి) : నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మండలాన్ని మార్కాపురం డివిజన్‌లో విలీనం చేయాలని టీడీపీ పోల్ మేనేజిమెంట్ ఇన్‌చార్జి కందుల రామిరెడ్డి, పాస్ సంస్థ నాయకులు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్‌కు వినతిపత్రం ఇచ్చారు. సీఎం చంద్రబాబు గతంలో ఇచ్చిన ఎన్నికల వాగ్దానం మేరకు నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా మార్కాపురం జిల్లాగా చేయనున్నారని తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు, ప్రజల ఆకాంక్షలు రోజువారీ అవసరాల కోసం నంద్యాల జిల్లా ఆత్మకూరు డీఎ్‌ఫవో పరిధిలో ఉన్న శ్రీశైలం, సున్నిపెంట, ఫారెస్ట్ బీట్‌లను మార్కాపురం డీఎఫ్‌వో కార్యాలయంలో విలీనం చేయాలన్నారు. రోళ్లపెంట నుంచి శ్రీశైలం శిఖరం వరకు ఉన్న అటవీ ప్రాంతం మార్కాపురం డీఎ్‌ఫవో పరిధిలో ఉందని, మిగిలిన కొంత ప్రాంతం ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉండిపోయిందని తెలిపారు. మార్కాపురానికి 80కి.మీ. దూరంలో ఉన్న శ్రీశైలంకు అనేక రకాల సంబంధాలు విద్యా, వైద్యం, పండ్లు, కూరగాయాలు, నిత్యావసర వస్తువులు ఇంకా అనేక వ్యాపారాలు ఇక్కడ నుంచే జరుగుతుంటాయని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు కూడా ముడిపడి ఉన్నాయన్నారు. జల వనరులకు సంబంధించి వివాధాలు తలెత్తెకుండా వెలిగొండ ప్రాజెక్టు ఆయకట్టు రైతుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం మండలాన్ని కొల్లం వాగు పరిసరాలను మార్కాపురం డివిజన్‌లో కలిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాస్ సంస్థ అధ్యక్షులు గాయం వెంకట నారాయణరెడ్డి, టీడీపీ నాయకులు మాలపాటి వెంకటరెడ్డి, బొగ్గు శేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డి, చలువాది వెంకటేశ్వర్లు, జంకె వెంకటరెడ్డి పాల్గొన్నారు.