డీసీవోగా శ్రీలక్ష్మి
ABN , Publish Date - Sep 20 , 2025 | 02:27 AM
జిల్లా సహకారాధికారిగా డి.శ్రీలక్ష్మి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెను ఇక్కడ డీసీవోగా నియమిస్తూ రాష్ట్ర సహకారశాఖ కమిషనర్ ఎ.బాబు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఆమె శుక్రవారం ఉదయం ఇప్పటి వరకూ డీసీవోగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించిన ఎన్.ఇందిరాదేవి నుంచి బాధ్యతలు తీసుకున్నారు.
బాధ్యతల స్వీకరణ
ఒంగోలు విద్య, సెప్టెంబరు 19 (ఆంధ్ర జ్యోతి) : జిల్లా సహకారాధికారిగా డి.శ్రీలక్ష్మి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెను ఇక్కడ డీసీవోగా నియమిస్తూ రాష్ట్ర సహకారశాఖ కమిషనర్ ఎ.బాబు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఆమె శుక్రవారం ఉదయం ఇప్పటి వరకూ డీసీవోగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించిన ఎన్.ఇందిరాదేవి నుంచి బాధ్యతలు తీసుకున్నారు. కడపకు చెందిన శ్రీలక్ష్మి హైదరా బాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ పూర్తిచేసి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఎంఈడీలో గోల్డ్ మెడల్ సాధించారు. 2002లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఉద్యోగ పర్వాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా జిల్లా అధికారి స్థాయికి ఎదిగారు. 2004లో స్కూలు అసిస్టెంట్‌గా ఎంపికైన శ్రీలక్ష్మి.. 2005లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏపీపీఎస్సీ ద్వారా జూనియర్ లెక్చరర్‌గా నియమితులయ్యారు. 2007లో గ్రూప్-1కు ఎంపికై సహకారశాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా ప్రస్థానం ప్రారంభించారు. తొమ్మిదేళ్లపాటు సహకార శాఖలో సేవలు అందించిన ఆమె.. ఆ తర్వాత ఫారిన్ సర్వీసులో వివిధ పోస్టుల్లో పనిచేశారు. శ్రీకాళహస్తి మునిసిపల్ కమిష నర్‌గా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా, తిరుపతి మునిసిపల్ డిప్యూటీ కమిషన ర్‌గా, తుడాలో అధికారిగా, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం స్పెషల్ కేడర్ డిప్యూటీ రిజిస్ట్రార్ (ఎస్‌సీడీఆర్) హోదాలో జిల్లా సహకారాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.