క్రీడలను ప్రోత్సహించాలి
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:12 AM
క్రీడలను మరింత పోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ జనరల్ సెక్రటరీ కరణం చెంచు పున్నయ్య అన్నారు. కేవలం విద్యపై దృష్టిపెట్టడంతో పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పర్చూరులో రూ.2కోట్ల వ్యయంతో నిర్మాణం చేసిన ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్
ఇండియా మాజీ జనరల్ సెక్రటరీ
చెంచుపున్నయ్య
ఎన్టీఆర్ క్రీడా స్టేడియం
నిర్మాణ పనుల పరిశీలన
పర్చూరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : క్రీడలను మరింత పోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ జనరల్ సెక్రటరీ కరణం చెంచు పున్నయ్య అన్నారు. కేవలం విద్యపై దృష్టిపెట్టడంతో పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పర్చూరులో రూ.2కోట్ల వ్యయంతో నిర్మాణం చేసిన ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలను పోత్సహించాలన్న సంకల్పంతో తెలుగుదేశం ప్రభత్వ హయాంలో రూ.కోట్లు వెచ్చించి నిర్మాణం చేసిన అనేక క్రీడా ప్రాంగణాలు గత వైసీపీ పాలనలో నిరాధరణకు గురయ్యాయన్నారు. కొద్దిపాటి నిధులతో వినియోగంలోకి వచ్చే క్రీడా ప్రాంగణాలను కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తీసుకురావడంతోపాటు క్రీడాకారులకు తోడ్పాటునందించాలన్న లక్ష్యంతో ముందకు సాగుతుందన్నారు. పర్చూరు క్రీడాప్రాంగణం అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృషిని అభినందించారు. గ్రామీణ క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు తీర్చి దిద్దేందుకు ఇది ఎంతగనో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తంగెళ్ల మల్లికార్జునరావు, ప్రకాశం జిల్లా మాజీ బ్యాడ్మింటన్ సెక్రటరీ షాహీద్, పఠాన్ బాజీ పాల్గొన్నారు.