Share News

చీరాల అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:23 PM

చీరాల ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ వెంకటమురళి, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చెప్పారు. మునిసిపల్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(మీకోసం)లో వచ్చిన అర్జీల పరిష్కారంపై నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.

చీరాల అభివృద్ధి పనులను వేగవంతం చేయండి
అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ వెంకటమురళి, ఎమ్మెల్యే కొండయ్య, జేసీ ప్రకర్‌జైన్‌

‘మీకోసం’ అర్జీలపై కలెక్టర్‌, ఎమ్మెల్యే సమీక్ష

రూ.14కోట్లు మంజూరుకు హామీ

చీరాల, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) : చీరాల ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ వెంకటమురళి, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చెప్పారు. మునిసిపల్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(మీకోసం)లో వచ్చిన అర్జీల పరిష్కారంపై నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ముందుగా ఎమ్మెల్యే స్వీకరించిన అర్జీలతో పాటు ప్రధానంగా నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మునిసిపల్‌ పరిధిలో డ్రెయిన్‌లు, అంతర్గత రహదారులు, విద్యుత్‌ సమస్యలు, ముఖ్యంగా 31వ వార్డులోని ఆక్రమణలపై ప్రస్తావించారు. అలాగే గ్రామాల్లోని లిఫ్టిరిగేషన్‌కు సంబంధించి మరమ్మతులకు గురైన యంత్రాలు గు రించి మాట్లాడారు. తోటవారిపాలెం ఎత్తిపోతల పథకానికి రూ.20లక్షలు మంజూ రు, మిగిలిన ఎత్తిపోతలు, నీటి అవసరాలపై చర్చించారు. ఫిషింగ్‌ హార్బర్‌ స్థలం పునఃపరిశీలన, హ్యాండ్‌లూమ్‌ పార్కు, ఇసుక కొరత గురించి మాట్లాడారు. జగనన్న కాలనీలు అధ్వానంగా ఉన్నట్లు చె ప్పారు. కారంచేడు రైలు గేటువద్ద గేట సమస్యతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులుపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ఒక్కో అంశంపై కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులతో చర్చ సాగించారు. తాగునీటికి సంబంధించి ఇప్పటికే మునిసిపాల్టీలో రూ.1.50కోట్ల నిధులు ఉన్నట్లు కమిషనర్‌ ద్వారా తెలుసుకున్నారు. పన్ను వసూళ్లలో మరో రూ.కోటి వరకు అవకాశం ఉంటుందని చెప్పడంతో సమస్యకు పరిష్కారం చూడాలని సూచించారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ గతంలో బీచ్‌ అభివృద్ధితో పాటు పట్టణంలో పలు పనులకు మొత్తంగా రూ.14కోట్లు అందిస్తామని చెప్పారు. సత్వరమే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. జేసీ ప్రకర్‌జైన్‌, ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, తహసీల్దార్‌ గోపీకృష్ణ పాల్గొన్నారు.

కర్లపాలెం ఎస్‌ఐ వేధిస్తున్నారు

ఇక్కుర్తి సుబ్బారావు, యాజలి

మాకు చెందిన 1.50 ఎకరం భూమిలో వేరు శనగ పప్పు చల్లా. నెల గడిచాక కొందరు వ్యక్తులు మా పొలాన్ని దున్నేశారు. కర్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాను. పట్టించుకోవడం లేదు. తిరిగి 5 క్వింటాళ్ల పప్పు కొని సాగుకు సిద్ధపడ్డాను. దాడులు చేస్తున్నారు. ఎస్సై వారితో కుమ్మక్కై మమ్మల్ని బెదురిస్తున్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాను.

కలుషిత నీటితో సాగుకు సమస్య

- రమణారెడ్డి, రైతు సంఘం నాయకుడు

మునిసిపాల్టీకి చెందిన మురుగు, వ్యర్థాలు దండుబాటలో నుంచి విజయగనర్‌ కాలనీ సమీపంలోని ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్‌లో కలుస్తున్నాయి. తద్వారా గవినివారిపాలెం ఎత్తిపోతల పథకం పరిధిలోని పిట్టువారిపాలెం, విజయలక్ష్మీపురం, పచ్చమొగిలి, కొత్తవాడరేవు, బుర్లవారిపాలెం, కీర్తివారిపాలెం, పెర్లవారి పాలెం, కొత్తపేట, పాపాయిపాలెం, చల్లారెడ్డిపాలెం ప్రాంతాలకు చెందిన సుమారు 5వేల ఎకరాల పంట పొలాలు దెబ్బతింటున్నాయి. వేల సంఖ్యలో మూగ జీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. అధికారులు, పాలకులు స్పందించి చర్యలు తీసుకోవాలి.

Updated Date - Apr 21 , 2025 | 11:23 PM