Share News

నగరంలో ‘నక్ష’ సర్వేకు ప్రత్యేక టీములు

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:36 AM

నగరంలో నేషనల్‌ జియో స్పేసియ ల్‌ నాలెడ్జ్‌ బెస్ట్‌ ల్యాండ్‌ సర్వే ఆఫ్‌ అర్బన్‌ హ్యాబిటేషన్‌ (నక్ష) సర్వే కోసం 14 ప్రత్యేక టీ ములను నియమించినట్లు కార్పొరేషన్‌ కమిష నర్‌ కె.వెంకటేశ్వరరావు తెలిపారు.

 నగరంలో ‘నక్ష’ సర్వేకు ప్రత్యేక టీములు

కమిషనర్‌ వెంకటేశ్వరరావు

ఒంగోలు కార్పొరేషన్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్ర జ్యోతి) : నగరంలో నేషనల్‌ జియో స్పేసియ ల్‌ నాలెడ్జ్‌ బెస్ట్‌ ల్యాండ్‌ సర్వే ఆఫ్‌ అర్బన్‌ హ్యాబిటేషన్‌ (నక్ష) సర్వే కోసం 14 ప్రత్యేక టీ ములను నియమించినట్లు కార్పొరేషన్‌ కమిష నర్‌ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం స్థానిక వెంకగముక్కలపాలెంలో క్విస్‌ కాలే జీతో క్యూజీఐఎస్‌ సాఫ్ట్‌వేర్‌, అడ్వాన్స్‌ సర్వే మెథాడాలజీ ద్వారా నగరంలోని సర్వేపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పద్ధతిపై ప్రతి ఇంటి ఖచ్చితత్వం కోసం లేటేస్ట్‌ టెక్నాలజీతో లీగల్‌ సమస్యలు రాకుండా సులభతరంగా భూ రికార్డులను ఆధునీకరిస్తామని తెలిపారు. కార్పొరేషన్‌ టౌ న్‌ప్లానింగ్‌, ప్లానింగ్‌ సెక్రటరీలు, ఇతర సర్వే సిబ్బంది దీనిపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. కాగా డీటీడీసీ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీని వాస్‌, జీఐఎస్‌ టీమ్‌ సభ్యులు ప్రవీణ్‌, వెంక టేశ్వర్లు శిక్షణ ఇచ్చారు. అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ జెడ్‌.సుధాకర్‌, ఏసీపీ-2 శ్రీలక్ష్మి, టీపీవో బా బూరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 12:36 AM