గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
ABN , Publish Date - Nov 08 , 2025 | 10:23 PM
నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటున్న చెంచు గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పేర్కొన్నారు.
టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు
పెద్ద దోర్నాల,నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటున్న చెంచు గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పేర్కొన్నారు. మండలంలోని కొర్రప్రోలు చెంచు గిరిజన గూడెంలో లైట్ ఫర్ బ్లైండ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మొంథా తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడ్డ గిరిజనులకు నిత్యావసర సరుకులను ఎరిక్షన్‌బాబు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ ఆర్గనైజర్ దాసరి స్వర్ణలత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన చెంచుల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం ఆది నుంచీ కృషి చేస్తూనే ఉందన్నారు. ఎన్టీఆర్ ఐటీడీఏను ఏర్పాటు చేశారని, తద్వారా గూడేలలో మౌలిక వసతుల కల్పన జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరిన్ని పథకాలు అమలు చేశారన్నారు. ట్రైకార్ రుణాలు, పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం, యువకుల ఉన్నత విద్యకు ఆర్థిక సాయం, గిరిజన యువతుల వివాహానికి పెళ్లికానుక వంటి పథకాలు అందించినట్లు గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ రద్దు చేసిందన్నారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం గిరిజన నిరుద్యోగులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలో కలెక్టర్ మండలానికి రానున్నారని చెంచుల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.ప్రభుత్వం ప్రోత్సాహంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు షేక్‌మాబు, నాయకులు దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, చంటి, దేసు నాగేంద్రబాబు, ఎలకపాటి చంచయ్య, దర్శనం దేవయ్య, ఒంటేరు రాఘవ, షేక్ మౌలాలి, కే సుబ్బారెడ్డి, షేక్ మంజూర్‌బాషా పాల్గొన్నారు.