Share News

విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Aug 19 , 2025 | 10:43 PM

రాష్ట్ర ప్రభుత్వం విభిన్నప్రతిభావంతులైన విద్యార్థుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు చెప్పారు.

విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టి
మాట్లాడుతున్న ఎరిక్షన్‌బాబు

టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం,ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం విభిన్నప్రతిభావంతులైన విద్యార్థుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు చెప్పారు. స్థానిక ఆర్డీటీ ఆడిటోరియంలో మంగళవారం విభిన్నప్రతిభావంతులైన విద్యార్థులకు శారీక పరీక్షలు నిర్వహించేందుకు స్ర్కీనింగ్‌ సెంటరును ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యాశాఖ, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విభిన్నప్రతిభావంతులైన విద్యార్థుల కోసం నెలకు 6 వేలు పింఛన్ల పంపిణీతో పాటు, వీరికి విద్య కోసం ప్రత్యేక పాఠశాలలు, భవిత సెంటర్లు ఏర్పాటు చేసి ఫిజియోథెరపీ నిర్వహిస్తున్నారన్నారు. వీరికి ఉపకరణాలు పంపిణీ చేసేందుకు స్ర్కీనింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో జరిగిన స్ర్కీనింగ్‌లో 119 మందికి ప్రత్యేక ఉపకరణాల కోసం పరీక్షించారు. ఈ కార్యక్రమానికి ఎంఈవో ఆంజనేయులు అధ్యక్షత వహించగా, ఏఎంసీ చైర్మన్‌ చేకూరి సుబ్బారావు, ఎంఈవోలు మస్తాన్‌నాయక్‌, ఇందిర ప్రసాదు, రాజశేఖరరెడ్డి, డాక్టరు అంకరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 10:43 PM