Share News

ఆరోగ్యం..విద్యపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Sep 29 , 2025 | 10:31 PM

కేంద్ర, ర్రాష్ట ప్రభుత్వాలు పౌ రుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు.

ఆరోగ్యం..విద్యపై ప్రత్యేక దృష్టి
కంభం ప్రభుత్వాసుపత్రిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

కంభం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, ర్రాష్ట ప్రభుత్వాలు పౌ రుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. సోమవారం కంభం ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశంలోని ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలన్న సంక్పంతో ముందుకు సాగుతున్నారన్నారు. ఈనెల 17 నుంచి అక్టోబర్‌ 2వ వరకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రజారోగ్యంపై దృష్టి సారించారన్నారు. గిద్దలూరులో వందపడకల వైద్యశాల, కంభంలో 50పడకల ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అంతకు ముందు ఆయన కంభం వైద్యశాలను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో కంభం ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌ శిరీష ప్రియదర్శిని, డాక్టర్‌ శివనాయక్‌, ప్రత్యేకాధికారి వంశీకృష్ణ, ఎంపీడీవో వీరభద్రాచారి, కంభం, బేస్తవారపేట, అర్ధవీడు మండలాల టీడీపీ, జనసేన, బిజేపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2025 | 10:31 PM