Share News

స్పెషల్‌ బ్రాంచి సీఐ రాఘవేంద్ర వీఆర్‌కు..

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:32 AM

స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రాఘవేంద్రరావును రేంజ్‌ వీఆర్‌కు పిలుస్తూ గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాఘవేంద్రరావు ఇప్పటికే మూడు పర్యాయాలు ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు.

స్పెషల్‌ బ్రాంచి సీఐ రాఘవేంద్ర వీఆర్‌కు..

ఆయనపై పలువురు ఎమ్మెల్యేల ఆరోపణలు

ఇటీవల హోంమంత్రికి కూడా ఫిర్యాదు

ఒంగోలు క్రైం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రాఘవేంద్రరావును రేంజ్‌ వీఆర్‌కు పిలుస్తూ గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాఘవేంద్రరావు ఇప్పటికే మూడు పర్యాయాలు ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. మూడో దఫా సాధారణ ఎన్నికల ముందు నుంచి ఎస్‌బీలో కొనసాగుతున్నారు. ప్రభుత్వం మారిన తరువాత ఆయనపై పలువురు ఎమ్మెల్యేలు నేరుగా ఇన్‌చార్జి మంత్రి సమక్షంలో ఆరోపణలు చేశారు. హోంమంత్రికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు రాఘవేంద్రను వీఆర్‌కు పిలిచారు. ఆయన స్థానంలో ఇక్కడ ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న భీమానాయక్‌కు కానీ, ఎస్సీ, ఎస్టీ సెల్‌ సీఐగా పనిచేస్తున్న దుర్గాప్రసాద్‌కు కానీ తాత్కాలిక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది.

Updated Date - Nov 04 , 2025 | 12:32 AM