Share News

పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - Oct 21 , 2025 | 11:05 PM

పేదలు ఆరోగ్యంగా ఉం టేనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనందంగా ఉంటారని, ఆదిశగా ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.

పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

100 మందికి 54.50 లక్షల చెక్కుల పంపిణీ

గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : పేదలు ఆరోగ్యంగా ఉం టేనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనందంగా ఉంటారని, ఆదిశగా ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వందమంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.54,50,093 చెక్కుల రూపంలో అందచేశారు. అనంతరం ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక ఆపన్న హస్తమని, పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. పట్టణాలలోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో పేదవారు నాణ్యమైన వైద్యం ప్రస్తుతం పొందవచ్చన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అనేక మంది పేదలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి అండగా నిలబడాలన్నదే ద్యేయమన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలోని 440 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.4,64,97,216 అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో గిద్దలూరు, కంభం మార్కెట్‌యార్డు చైర్మన్లు బైలడుగు బాలయ్య, పూనూరు భూపాల్‌రెడ్డి, కంభం, గిద్దలూరు సొసైటీ బ్యాంక్‌ చైర్మన్లు కేతం శ్రీనివాసులు, దుత్తా బాలీశ్వరయ్య, మండలపార్టీ అద్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. దివ్యాంగుడైన తురిమెళ్ల గ్రామానికి పీరావలికి అశోక్‌రెడ్డి వీల్‌చైర్‌ను అందచేశారు.

పేదల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం

మార్కాపురం : బలహీన వర్గాలు, పేదల శ్రేయస్సే ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి వసంతలక్ష్మి అన్నారు. పట్టణ, మండల పరిధిలోని 11 మందికి మంజూరైన సీఎమ్‌ఆర్‌ఎఫ్‌ చెక్కులను సోమవారం ఆమె ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. మొత్తం రూ.5.51 లక్షల మేర చెక్కులను ప్రైవేటు వైద్య చికిత్సలు పొందిన వారికి అందించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ గుంటక కృష్ణవేణి, టీఎల్‌ఎఫ్‌ అధ్యక్షురాలు దొడ్డా రవణమ్మమ, పట్టణ అధ్యక్షుడు పఠాన్‌ ఇబ్రహీంఖాన్‌, కార్యదర్శి మేడిద రంగస్వామి, రాష్ట్ర రజక కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కనిగిరి రమణ, జాబీర్‌హుసేన్‌బేగ్‌, ఎమ్‌.చెన్నారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2025 | 11:05 PM