జిల్లా జైలును పరిశీలించిన ఎస్పీ
ABN , Publish Date - May 28 , 2025 | 01:28 AM
జిల్లా జైలులో భద్రత.. బ్యారక్‌లు, వైద్య సదుపాయాలు, పరిసరాలను ఎస్పీ దామోదర్ మంగళవారం పరిశీలించారు. అనంతరం అంతర్గత భద్రతపై అధికారులతో సమావేశమయ్యారు. అక్కడ తీసుకోవాల్సిన కొన్ని భద్రత చర్యలపై సూచనలు చేశారు.
అంతర్గత భద్రతపై అధికారులతో సమావేశం
ఒంగోలు క్రైం,మే 27(ఆంధ్రజ్యోతి): జిల్లా జైలులో భద్రత.. బ్యారక్‌లు, వైద్య సదుపాయాలు, పరిసరాలను ఎస్పీ దామోదర్ మంగళవారం పరిశీలించారు. అనంతరం అంతర్గత భద్రతపై అధికారులతో సమావేశమయ్యారు. అక్కడ తీసుకోవాల్సిన కొన్ని భద్రత చర్యలపై సూచనలు చేశారు. రిమాండ్ ఖైదీలను తరలించే సమయంలో జైలు అధికారులు, పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. మహిళా ఖైదీలకు ప్రత్యేక భద్రత కల్పించాలని అన్నారు. సమావేశంలో జైలు సూపరింటెండెంట్ పి.వరుణారెడ్డి, ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, సీఐలు విజయకృష్ణ, నాగరాజు, శ్రీనివాసరావు, పాండురంగారావు, జైలర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.