మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించండి
ABN , Publish Date - Oct 09 , 2025 | 10:29 PM
మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని మాజీ సైనికుల హౌసింగ్ బోర్డు సొసైటీ సభ్యులు కోరారు.
మార్కాపురం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని మాజీ సైనికుల హౌసింగ్ బోర్డు సొసైటీ సభ్యులు కోరారు. స్థానిక జవహర్‌నగర్ కాలనీలోని పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హౌసింగ్ సొసైటీని ఏర్పాటు గురించి ఆయనకు వివరించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కందుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు సొసైటీ అధ్యక్షుడు చిన్నయ్య, కార్యదర్శి వెంకటనారాయణరెడ్డి, జైజవాన్ అసోసియేషన్ అధ్యక్షులు హరినారాయణరెడ్డి, కార్యదర్శి శేషసాయి పాల్గొన్నారు.