జిల్లా ఏర్పాటుతో సమస్యలకు పరిష్కారం
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:09 PM
జిల్లా ఏర్పాటుతో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంగళవారం నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ జరిగింది.
ఎమ్మెల్యే నారాయణరెడ్డి
నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ
మార్కాపురం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లా ఏర్పాటుతో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంగళవారం నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ జరిగింది. సెవెన్‌హిల్స్ సెంటర్ నుంచి ర్యాలీని ఎమ్మెల్యే నారాయణరెడ్డి ప్రారంభించారు. అక్కడ నుంచి దోర్నాల బస్టాండ్, గడియార స్తంభం సెంటర్, కంభం బస్టాండ్, కోర్టు సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ జరిగింది. నాయీ బ్రాహ్మణులు మంగళ వాయిద్యాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ జిల్లా ఏర్పాటుతో మార్కాపురం ప్రాంతం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందన్నారు. ఈ ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పీవీ కృష్ణారావు, టీడీపీ నాయకులు తాళ్లపల్లి సత్యనారాయణ, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఇబ్రహీంఖాన్, డాక్టర్ షేక్ మౌ ళాలి, పఠాన్ హుసేన్‌ఖాన్, సయ్యద్ గఫా ర్, దూపాటి యలమంద, నాయీ బ్రాహ్మ ణ సంఘ నాయకులు పాల్గొన్నారు.