Share News

పహల్గాం మృతులకు సంఘీభావం

ABN , Publish Date - May 02 , 2025 | 12:16 AM

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి మృతి చెందిన పర్యాటకులకు జిల్లా మాజీ సైనికులు సంఘీభావం ప్రకటించారు. గురువారం ఒంగోలులోని చర్చిసెంటర్‌లో మా నవహారం నిర్వహించారు.

పహల్గాం మృతులకు సంఘీభావం

ఒంగోలు(రూరల్‌), మే1(ఆంధ్రజ్యోతి): జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి మృతి చెందిన పర్యాటకులకు జిల్లా మాజీ సైనికులు సంఘీభావం ప్రకటించారు. గురువారం ఒంగోలులోని చర్చిసెంటర్‌లో మా నవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సైనికుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నెప్పల నాగేశ్వరరావు మాట్లాడుతూ జమ్ముకశ్మీర్‌లో పాకిస్తా న్‌కు చెందిన ఉగ్రవాదులును సైన్యం ఏరివేయాలన్నారు. 26మంది పర్యాట కులను ఉగ్రవాదులు కాల్చి చంపడం ఎంత మాత్రం సహించకూడని వి షయమని, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దేశ ప్రజలు సైన్యానికి అండగా ఉండాల న్నారు. మృతి చెందిన పర్యాటకులకు నివాళులర్పించారు. భారత్‌ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆలపాటి వెంక టేశ్వర్లు, పాశం వెంకటరెడ్డి, మండవ వెంకటేశ్వర్లు, తుళ్లూరి వెంకటేశ్వర రావు, బి.వెకంటేశ్వరరావు, చీమకుర్తి సుబ్బారావు, బ్రహ్మయ్య, ఎస్‌బీఐ అం జయ్య, క్యాంటీన్‌ మేనేజర్‌ గుమ్మడి వెంకట్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శెగ్గెం శ్రీనివాసరావు, మాజీ సైనికులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2025 | 12:16 AM