సోలార్ వినియోగాన్ని పెంపొందించుకోవాలి
ABN , Publish Date - Jun 24 , 2025 | 10:53 PM
ప్రజలు సోలార్ వినియోగాన్ని పెంపొం దించుకోవాలని ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం జరి గిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో విద్యుత్ కొర త ఏర్పడకుండా ఉండేందుకు ప్రతిఒక్కరూ సోలార్ సెట్లను తమ గృహా లకు ఏర్పాటుచేసుకోవాలని సూచించారు.
దర్శి, జూన్ 24(ఆంధ్రజ్యోతి): ప్రజలు సోలార్ వినియోగాన్ని పెంపొం దించుకోవాలని ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం జరి గిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో విద్యుత్ కొర త ఏర్పడకుండా ఉండేందుకు ప్రతిఒక్కరూ సోలార్ సెట్లను తమ గృహా లకు ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు 1650 సోలార్ కనెక్షన్లు ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ప్రజలకు, రైతులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. పెండింగ్ బకాయిలను సత్వరమే వసూళ్లు చేయాలన్నారు. అక్రమ విద్యుత్ వాడకాన్ని పూర్తిగా నివారించాలన్నారు. కార్యక్రమంలో ఈఈ పి.శ్రీనివాసులు, డీఈ రవికుమార్, దర్శి డివిజన్ పరిధిలోని అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.