7 సబ్‌స్టేషన్‌ల వద్ద సోలార్ ప్లాంట్‌లు
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:36 PM
వ్యవసాయానికి సోలార్ విద్యుత్ అందించటమే ధ్యేయంగా పీఎం కుసుమ పథకం ద్వారా చేపట్టనున్న సోలార్ ప్లాంట్‌లకు అసవరమైన స్థలాలను ఎస్‌ఈ ఆంజనేయులు బుధవారం పరిశీలించారు. అద్దంకి నియోజకవర్గంలో 7 సబ్‌స్టేషన్‌లకు అనుబంధంగా 17 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంట్‌లు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలను పరిశీలించారు.
ఏర్పాటుకు స్థలాల పరిశీలన
అద్దంకి, అక్టోబరు8(ఆంధ్రజ్యోతి): వ్యవసాయానికి సోలార్ విద్యుత్ అందించటమే ధ్యేయంగా పీఎం కుసుమ పథకం ద్వారా చేపట్టనున్న సోలార్ ప్లాంట్‌లకు అసవరమైన స్థలాలను ఎస్‌ఈ ఆంజనేయులు బుధవారం పరిశీలించారు. అద్దంకి నియోజకవర్గంలో 7 సబ్‌స్టేషన్‌లకు అనుబంధంగా 17 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంట్‌లు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలను పరిశీలించారు. సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు, బల్లికురవ వ ుండలం వి.కొప్పెరపాడు, వెలమవారిపాలెం, కొమ్మినేనివారిపాలెం, అద్దంకి మండలం సాధునగర్, శంకవరప్పాడు, కుంకుబాడు సబ్‌స్టేషన్‌ల సమీపంలో రైతుల వద్ద నుంచి భూములు లీజుకు తీసుకొని సోలార్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఎస్‌ఈ ఆంజనేయులు, ఈఈ నల్లూరి మస్తాన్‌రావులు ఎకోరన్ ఎనర్జీ ప్రతినిధులతో కలిసి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. డీఈఈలు సురేంద్రబాబు, దామోదరం, డివిజన్ కార్యాలయం ఏఈ బాలకోటేశ్వరరావులు పాల్గొన్నారు.