Share News

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని సన్మానించిన సొసైటీ బ్యాంక్‌ చైర్మన్లు

ABN , Publish Date - Sep 11 , 2025 | 10:18 PM

బేస్తవారపేట మండలంలోని బేస్తవారపేట, గలిజేరుగుళ్ల సొసైటీ బ్యాంక్‌ చైర్మన్లుగా నియమితులైన వెంకటరమణారెడ్డి, నరసింహయాదవ్‌ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని సన్మానించిన సొసైటీ బ్యాంక్‌ చైర్మన్లు
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని సన్మానిస్తున్న సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌

గిద్దలూరు టౌన్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): బేస్తవారపేట మండలంలోని బేస్తవారపేట, గలిజేరుగుళ్ల సొసైటీ బ్యాంక్‌ చైర్మన్లుగా నియమితులైన వెంకటరమణారెడ్డి, నరసింహయాదవ్‌ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో బేస్తవారపేట సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌గా నియమితులైన పూసలపాడుకు చెందిన దుంపా వెంకట రమణారెడ్డి, గలిజేరుగుళ్ల సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌గా నియమితులైన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుంటక నరసింహయాదవ్‌లు నియమితులయ్యారు. వారు అనుచరులతో కలిసి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపి పూలమాలలు, శాలువలతో సన్మానించారు. కార్యక్రమంలో మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు సోరెడ్డి మోహన్‌రెడ్డి, దూదేకుల సైదులు ఉన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 10:18 PM