Share News

ఆరోగ్య ఉపకేంద్రంలో పాముల నివాసం

ABN , Publish Date - Jun 15 , 2025 | 10:16 PM

నిరుపయోగంగా ఉన్న హెల్త్‌క్లీనిక్‌ తలు పులు తెరిచి పరిశీలిస్తున్న ఎంఎల్‌హెచ్‌పీ జాస్మిన్‌ పాముకాటుకు గురయ్యాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని తూ ర్పుకట్టకిందపల్లిలో చోటుచేసుకుంది.

ఆరోగ్య ఉపకేంద్రంలో పాముల నివాసం
పిచ్చి మొక్కల మధ్య ఆరోగ్య ఉపకేంద్రం

కాటుకు గురైన ఉద్యోగి

మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలింపు

పామూరు, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): నిరుపయోగంగా ఉన్న హెల్త్‌క్లీనిక్‌ తలు పులు తెరిచి పరిశీలిస్తున్న ఎంఎల్‌హెచ్‌పీ జాస్మిన్‌ పాముకాటుకు గురయ్యాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని తూ ర్పుకట్టకిందపల్లిలో చోటుచేసుకుంది. గ్రా మస్థుల కథనం ప్రకారం.. బీసీ కాలనీలో గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన హెల్త్‌ క్లీనిక్‌ నిరుపయోగంగా ఉంది. ఇటీవల ఆరోగ్యఉపకేంద్రానికి సంబంధిం చిన సెప్టిక్‌ ట్యాంకుపై మూత లేకపో వడం తో గేదె మృతి చెం దింది. ఈక్రమంలో బొట్లగూడూరు పీ హెచ్‌సీ డాక్టర్‌తో కలి సి రెండు రోజుల క్రి తం గ్రామ టీడీపీ నాయకులు ఆప్రాంతాన్ని పరిశీలించారు. నిరుప యోగంగా పడిఉన్న హెల్త్‌ క్లినిక్‌ను ప్రారంభిం చాలని కోరారు.

ఈనేపథ్యంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో నృజన ఆదేశాల మేరకు కేంద్రాన్ని ప్రారంభించేనిమిత్తం పరిశీలించేందుకు ఆదివారం సాయంత్రం ఎంఎ ల్‌హెచ్‌పీ జాస్మిన్‌, ఆశ, ఆరోగ్య కార్యకర్తలతో కలిసి ఆప్రాంతానికి వెళ్లారు. హెల్త్‌క్లీనిక్‌ తలు పులు తీసి లోపలికి వెళ్లి పరిశీలిస్తున్న సమ యంలో పాము కాటుకు గురైంది. దాంతో ఆమెను పా మూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. జిల్లా వైద్యశాఖ ఉన్నతాధి కారులకు డాక్టర్‌ రవళి ప్రియాంక సమాచారం అం దించడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్‌కు తర లించారు.

Updated Date - Jun 15 , 2025 | 10:16 PM