సజావుగా టెట్
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:35 AM
టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (ఏపీ టెట్) బుధవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లు ఉండగా మొదటి రోజైన బుధవారం ఉదయం సెషన్ మాత్రమే నిర్వహించారు.
549 మంది హాజరు
ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (ఏపీ టెట్) బుధవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లు ఉండగా మొదటి రోజైన బుధవారం ఉదయం సెషన్ మాత్రమే నిర్వహించారు. 605 మంది అభ్యర్థులను కేటాయించగా 549 మంది హాజరయ్యారు. 56మంది గైర్హాజరయ్యారు. గంట ముందుగానే అభ్యర్థులు ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన నోటీసు బోర్డుల్లో వారికి కేటాయించిన నెంబర్లను పరిశీలించుకున్నారు. కనిగిరికి చెందిన ఒక దివ్యాంగురాలిని ఆమె కుటుంబ సభ్యుడు ఎత్తుకొని పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు. టెట్ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుండటంతో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు పరీక్ష సజావుగా ముగియడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.