సజావుగా ఉద్యోగోన్నతి కౌన్సెలింగ్
ABN , Publish Date - Nov 05 , 2025 | 01:03 AM
ఉమ్మడి జిల్లాకు చెందిన గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన ఉద్యోగోన్నతి కౌన్సెలింగ్ సజావుగా జరిగింది. కలెక్టరేట్‌లోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో డీపీవో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం ఈ ప్రక్రియను నిర్వహించారు.
51 మంది హాజరు, ప్రమోషన్ వద్దన్న ఒకరు
మరో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు గైర్హాజరు
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాకు చెందిన గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన ఉద్యోగోన్నతి కౌన్సెలింగ్ సజావుగా జరిగింది. కలెక్టరేట్‌లోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో డీపీవో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం ఈ ప్రక్రియను నిర్వహించారు. గ్రేడ్-6లకు గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు సీనియారిటీ ప్రకారం 55 మందిని కౌన్సెలింగ్‌కు పిలిచారు. 51 మంది మాత్రమే హాజరయ్యారు. ఒకరు తనకు ప్రమోషన్ వద్దని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. మరో ముగ్గురు కౌన్సెలింగ్‌కు రాలేదు. కార్యక్రమంలో ఏవో శివారెడ్డి, మార్కాపురం డీఎల్‌పీవో సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.