Share News

ప్రజాసౌలభ్యం కోసమే స్మార్డ్‌ రేషన్‌ కార్డులు

ABN , Publish Date - Oct 11 , 2025 | 10:39 PM

ప్రజాసౌలభ్యం కోసమే స్మార్ట్‌ రేషన్‌కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. శనివారం స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు.

ప్రజాసౌలభ్యం కోసమే స్మార్డ్‌ రేషన్‌ కార్డులు
స్మార్ట్‌ రేషన్‌ కార్డులను లబ్దిదారులకు అందచేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రజాసౌలభ్యం కోసమే స్మార్ట్‌ రేషన్‌కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. శనివారం స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ ద్వారా కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేయటమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా అందించే సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. నూతనంగా మంజూరైన క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత స్మార్ట్‌ రేషన్‌ కార్డులతో ప్రజలకు మరింత మేలు చేకూరనుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతోమంది వృద్ధులు పింఛన్‌ రాకుండా ఇబ్బందులు పడ్డారన్నారు. ఇలాంటి దశలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పేదలకుటుంభాల లబ్ధికోసం తల్లిదండ్రులకు వేరుగా స్మార్ట్‌ రేషన్‌ కార్డును మంజూరు చేసిందన్నారు. సంతానంలో ఎవరికివారి కుటుంబానికి వేరుగా కార్డులు మంజూరుచేసినట్టు చెప్పారు. తద్వార వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న సంతానంలోని బిడ్డలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతుందన్నారు. ఇది కూటమి ప్రభుత్వ పాలనాదక్షతకు నిదర్శనమన్నారు. కొత్త రేషన్‌ కార్డుల్లో ఎలాంటి తప్పులు ఉన్నా వెంటనే వాటిని సరి చేయించుకోవాలని సూచించారు. ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సచివాలయల పరిధిలో, రేషన్‌ డీలర్‌ షాపుల పరిధిలోని కార్డులు అందజేస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 73,873 స్మార్ట్‌ రేషన్‌ కార్డులు మంజూరయ్యాయన్నారు. కనిగిరి మండలంలో 25,935 కార్డులు మంజూరయ్యా యన్నారు. పామూరు మండలంలో 17,731, సీఎస్‌పురంలో 11,761, హనుమంతునిపాడు లో 8,364, పీసీపల్లిలో 10,082, వెలిగండ్లలో 9,975 కార్డులు మంజూరైనట్టు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రవిశంకర్‌, టీడీపీ నాయకుటు దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, జంషీర్‌, పాలపర్తి వెంకటేశ్వర్లు, పిచ్చాల శ్రీనివాసరెడ్డి, కొండా కృష్ణారెడ్డి, సానికొమ్ము తిరుపతిరెడ్డి(ఎస్‌టీఆర్‌), వేమూరి రామయ్య, షేక్‌ ఫిరోజ్‌, యారవ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 10:39 PM